12 రోజులు తమిళనాడుకు కావేరీ నీళ్లు: సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: అక్టోబర్ 7వ తేది నుంచి 18వ తేదీ వరకు తమిళనాడుకు ప్రతి రోజూ 2,000 క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసింది.
మంగళవారం కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది నారీమన్ 7 నుంచి 18వ తేదీ వరకు ప్రతి రోజూ తమిళనాడుకు 1,500 క్యూ సెక్కుల నీరు విడుదల చేస్తామని సుప్రీం కోర్టుకు చెప్పారు. ఇదే సందర్బంలో తమిళనాడు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మాకు ఎక్కువ నీరు కావాలని డిమాండ్ చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రతి రోజూ 2,000 క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో మండ్య జిల్లా రైతులు, ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు అన్యాయం జరుగుతున్నా కర్ణాటక పెద్దలు ఏమీ సహాయం చెయ్యడం లేదని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications