లంచం కొట్టు, సెన్సార్ సర్టిఫిరెట్ పట్టు, సీబీఐ ఎంట్రీతో సీన్ చిత్రాన్నం, గోవిందా !
కన్నడ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న ఓ సెన్సార్ బోర్డు అధికారి సీబీఐ వలలో పడ్డారు. సెన్సార్ బోర్డు ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ ను బెంగళూరులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని మల్లేశ్వరలోని ఎస్‌ఆర్‌వీ స్టూడియోలో లంచం తీసుకుంటుండగా నిందితుడు ప్రశాంత్ కుమార్ ను అరెస్ట్ చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు సంబంధించిన విషయాలపై, సబ్ టైటిల్స్ ను పరిగణలోకి తీసుకుని సెన్సార్ సర్టిఫిక్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు అధికారి ప్రశాంత్ కుమార్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత టైగర్ నాగ్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సెన్సార్ అధికారి ప్రశాంత్ కుమార్ లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బెంగళూరులోని మల్లేశ్వరం ఎస్‌ఆర్‌వీ స్టూడియోలో ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి ప్రశాంత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఆయన్ను విచారించారు. సెన్సార్ బోర్డు అధికారి ప్రశాంత్ కుమార్ కొత్త నిర్మాతలను టార్గెట్ చేస్తూ వారిని వేధింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. అడవి అనే కన్నడ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా గత వారం రోజులుగా ఇబ్బంది పెడుతున్న సెన్సార్ బోర్డు అధికారి ప్రశాంత్ కుమార్ వేధింపులు తాళలేక దర్శక నిర్మాత టైగర్ నాగ్ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దర్శకుడు, నిర్మాత టైగర్ నాగ్ స్వయంగా సీబీఐ కార్యాలయానికి వెళ్లి సెన్సార్ బోర్డు అధికారి ప్రశాంత్ కుమార్ ఆగడాలపై ఫిర్యాదు చేశారని తెలిసింది. గత కొన్ని రోజులుగా లంచానికి వ్యతిరేకంగా టైగర్ నాగ్ చేస్తున్న పోరాటంలో కన్నడ నటుడు, దర్శకుడు, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఆస్కర్ కృష్ణ కూడా చేరారు.

సాయంత్రం 6 గంటల సమయంలో టైగర్ నాగ్ నుంచి లంచం తీసుకుంటుండగా ప్రశాంత్ కుమార్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సిటీలోని మల్లేశ్వరంలోని ఎస్‌ఆర్‌వీ థియేటర్ లోనే సెన్సార్ బోర్డు అధికారి ప్రశాంత్ కుమార్ ను పది మందికి పైగా సీబీఐ అధికారులు సివిల్ డ్రెస్‌లో వెళ్లి అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications