పీఎన్‌బీ స్కాం: సీఎఫ్‌వో విపుల్ అంబానీ సహా ఐదుగురి అరెస్ట్, నీరవ్ ఆస్తులపై గత ఏడాది జనవరిలోను సోదాలు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో సీబీఐ మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ గ్రూప్ నుంచి ముగ్గురు, గీతాంజలి గ్రూప్ నుంచి ఇద్దరిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో నీరవ్ మోడీ ఆర్థిక వ్యవహారాల అధ్యక్షులు విపుల్ అంబానీ, మరో నలుగురు ఉన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్జున్ పాటిల్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కవితా మన్‌కికర్‌లతో పాటు గీతాంజలి గ్రూప్ సీఎఫ్‌ఓ కపిల్ ఖండేల్వాల్, మేనేజర్ నితిన్ షాహీని అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా, నీరవ్ మోడీ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ గతంలోను సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో సోదాలు నిర్వహించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications