ఆగస్టా వెస్ట్‌ల్యాండ్: నారాయణన్‌ను ప్రశ్నించిన సిబిఐ

వివిఐపి చాపర్ డీల్ కుంభకోణం కేసులో సిబిఐ పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకె నారాయణన్, గోవా గవర్నర్ బివి వాంచూ వాంగ్మూలాలను రికార్డు చేయాలని భావించింది. ఈ చాపర్ డీల్ వ్యవహారంలో 360 కోట్ల రూపాయల లంచం చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి.
ప్రధాని, రాష్ట్రపతి, ఇతర వివిఐపిలు వాడడానికి 12 హెలికాప్టర్లను యుపిఎ ప్రభుత్వం కొనడానికి నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ 12 హెలికాప్టర్లకు సంబంధించిన సాంకేతిక పరిణామాలను సవరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 2005లో జరిగింది. ఆ సమయంలో నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు.
ఈ వ్యవహారంలో సిబిఐ ఐఎఎఫ్ మాజీ చీఫ్ ఎస్‌పి త్యాగిపై, మరో 13 మందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇందులో త్యాగి బంధువులతో పాటు ఐరోపా మధ్యవర్తులున్నారు. వివిఐపి హెలికాప్టర్ల ఎత్తును తగ్గించడానికి నిబంధనలకు విరుద్ధంగా త్యాగి అంగీకరించారనేది ఆరోపణ.












Click it and Unblock the Notifications