DKS: డీకేకి షాక్ ఇచ్చిన సీబీఐ, కాలేజ్ లో సోదాలు, 44. 93 శాతం ఆస్తి ఎలా పెరిగింది ?, మైండ్ బ్లాక్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కు సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. వీకెండ్ మోజు మెల్లిగా తీరిపోవడంతో ఐటీ హబ్ ప్రజలు లేటుగా నిద్రలేచారు. అయితే సీబీఐ అధికారులు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు ఊహించని షాక్ ఇచ్చారు. సీబీఐ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో డీకే. శివకుమార్ తో పాటు ఆయన అనుచరులు ఉలిక్కిపడ్డారని తెలిసింది.

బెంగళూరులో విద్యాసంస్థలు
బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ లో (ఆర్ఆర్ నగర్)లో డీకే శివకుమార్ కుటుంబ సభ్యుల యాజమాన్యంతో నేషనల్ ఎడ్జ్యుకేషన్ పౌండేషన్, గ్లోబల్ కాలేజ్ నిర్వహిస్తున్నారు. .డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య ఈ విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ విద్యాసంస్థలకు డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య సెక్రటరీగా పని చేస్తున్నారు.

హాయ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన సీబీఐ
సోమవారం ఉదయం సీబీఐ అధికారులు డీకే. శివకుమార్ విద్యాసంస్థల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాలేజ్ లోని కార్యాలయంలో అన్ని ఫైల్స్ పరిశీలించారు. ఈ కాలేజ్ కి భూమి ఎలా వచ్చింది అంటూ మొదలు పెట్టిన సీబీఐ అధికారులు ఇప్పటి వరకు విద్యాసంస్థల్లో ఏమి జరిగటింది అని పూర్తిగా ఆరా తీశారని తెలిసింది.

ఐదు ఏళ్లకు రూ. 163 కోట్లు ఎలా వచ్చింది ?
2013లో ఈ విద్యాసంస్థల ఆధాయం రూ. 33.93 కోట్లు ఉందని, 2018 నాటికి ఇదే విద్యాసంస్థల ఆధాయం రూ. 162 కోట్లకు పెరిగిందని సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐదు సంవత్సరాల కాలంలో విద్యాసంస్థలకు ఏకంగా 44.93 శాతం ఆధాయం ఎలా వచ్చింది అంటూ సీబీఐ అధికారులు ఇప్పటికే డీకే. శివకుమార్, ఆయన కుమార్తె ఐశ్వర్యను ప్రశ్నించారు.

మంత్రి హోదాలో అక్రమాస్తులు సంపాధించారని ?
డీకే. శివకుమార్ విద్యాసంస్థల ఆధాయం పెరిగిపోయే సమయంలో ఆయన కర్ణాటకలో క్యాబినేట్ హోదా మంత్రిగా పని చేశారని, ఆ సందర్బంలో ఆయన అధికారం అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాధించారని సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే విషయంలో కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు సోమవారం డీకే శివకుమార్ కు షాక్ ఇచ్చారు.

మీడియాకు మ్యాటర్ లీక్ కాకుండా ?
ఉదయం నుంచి డీకే శివకుమార్ విద్యాసంస్థల్లో సోదాలు జరుగుతున్నా సాయంత్రం వరకు మ్యాటర్ మీడియాకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. డీకే శివకుమార్ విద్యాసంస్థల్లో పలు డాక్యూమెంట్లు పరిశీలించిన అధికారులు కాలేజ్ యాజమాన్యం, అక్కడి సిబ్బందిని విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది.

అక్రమాస్తులకు ఆ ఇద్దరూ కారణం
డీకే శివకుమార్ అక్రమాస్తులు సంపాధించడానికి శశికుమార్, ఆంజనేయ అనే వ్యక్తులు సహకరించారని సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడీ అధికారులు, సీబీఐ అధికారులను అడ్డం పెట్టుకుని తన మీద రాజకీక్ష కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఇప్పటికే డీకే శివకుమార్ అనేకసార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కి పార్టీ పూర్తి మెజారిటీ వస్తే సీఎం అభ్యర్థిగా రెండో పేరు డీకే శివకుమార్ పేరు ఉందని కర్ణాటకలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అదే కోరుకంటున్నారు. ఇలాంటి సమయంలో డీకే శికుమార్ కు సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications