కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో రూ. 20 కోట్ల క్యాష్, గుప్తా చీటీ చింపేసిన సీబీఐ, గోల్డ్ !
న్యూఢిల్లీ/ముంబాయి: కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసే వారికి జీతాలు ప్రతినెల రూ. లక్షల్లోనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలతో పాటు లాభాలు కూడాబాగానే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇంటిలో రూ. 20 కోట్ల కంటే ఎక్కువ నగదు మాత్రమే స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
వ్యాప్ కాస్ లిమిటెడ్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేందర్ కుమార్ గుప్తా విధులు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న రాజేందర్ కుమార్ గుప్తా ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని, ఆయన చాలా అవినీతికి పాల్పడ్డారని చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి.

ఎన్ని ఆరోపణలు వచ్చినా రాజేందర్ కుమార్ గుప్తా మాత్రం ఆయన చేతివాటం చూపిస్తూనే కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాధించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మ్యాటర్ సీబీఐ అధికారులకు తెలిసింది. సీబీఐ అధికారులు చాలాకాలం నుంచి కేంద్ర ప్రభుతంలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్న రాజేందర్ కుమార్ గుప్తా మీద డేగ కన్ను వేశారు.
రాజేంద్ర కుమార్ గుప్తాకు బుధవారం గ్రహాలు అన్ని అనుకూలించకపోవడంతో ఢిల్లీలోని ఆయన నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన 19 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. సీబీఐ సోదాల్లో రాజేందర్ కుమార్ గుప్తాకు సంబంధించిన దిమ్మతిరిగిపోయే విషయాలు, వివరాలు బయటకు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాజేందర్ కుమార్ గుప్తా ఇంటిలో ఏకంగా రూ. 20 కోట్లకు పైగా నగదు కట్టలు బయటపడటంతో సీబీఐ అధికారులు బిత్తరపోయారు. నగదు మాత్రమే 20 కోట్లు చిక్కడంతో రాజేందర్ కుమార్ గుప్తాకు సంబంధించిన ఆస్తులు, బంగారం విలువ ఎంత ఉంటుందో ; అని చర్చ మొదలైయ్యింది. రాజేందర్ కుమార్ గుప్తా అక్రమాస్తుల కేసు విచారణలో ఉన్నందున మిగిలిన వివరాలు చెప్పడానికి సీబీఐ అధికారులు నిరాకరించారని స్థానిక మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications