విజయ్ మాల్యాను రప్పించే ప్రయత్నాలు ముమ్మరం, లండన్‌ చేరుకున్న సీబీఐ-ఈడీ ప్రత్యేక బృందం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారీ రుణ ఎగవేతదారుడు, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించే ప్రయత్నాలను అధికారులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఇటీవల లిక్కర్ కింగ్‌ అరెస్ట్‌ తరువాత భారత విచారణ అధికారులు మరింత వేగంగా కదులుతున్నారు.

ఈ మేరకు ఎన్‌ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ (ఇడి) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సీనియర్ అధికారుల ప్రత్యేక బృందం లండన్‌ చేరుకుంది. అక్కడి బ్రిటిష్‌ న్యాయవాదులతో చర్చలు జరపనున్నారు.

భారత్‌కు విజయ్‌ మాల్యాను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈడీ, సీబీఐ అధికారులతో కూడిన బృందం లండన్‌కు చేరుకుంది. సిబిఐ అదనపు డైరెక్టర్ రాకేష్ ఆస్తానా నేతృత్వంలో బృందం ఈ వ్యవహారాన్ని పరిశీలించనున్నారు.

CBI Team in London to Expedite Vijay Mallya's Extradition

మాల్యాను దేశానికి తిరిగి తీసుకు వచ్చేందుకు లండన్‌ విచారణ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. అలాగే ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శులు రాజీవ్ మెహ్రిషి , అంబర్ రుద్ల చర్చించనున్నట్టు చెప్పాయి.

గత వారం లండన్‌లో మాల్యా అరెస్ట్‌ అయినప్పటినుంచి సీబీఐ, ఈడీ , బ్రిటిష్‌ న్యాయవాదులు పరస్పరంతో సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపాయి. ఇటీవల లండన్‌ లో అరెస్ట్‌ చేసిన విజయ్ మాల్యాకు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసు మే 17న విచారణకు రానున్న సంగతి తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Delhi: A team of CBI officers is in London to expedite the extradition process of Vijay Mallya. The team, led by CBI Additional Director Rakesh Asthana, would hold talks with the British prosecutors.The 61-year-old liquor baron, wanted in India for defaulting on loans, was arrested on April 19, after he appeared at a central London police station. He appeared at Westminster Magistrates' Court in London and was seen walking out with his legal team a few hours later after being granted bail. The government has said that its agencies were making their best efforts to have Mallya face trial in India. The next hearing of the case will be on May 17.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి