వ్యాపం: సీబీఐ బృందంలో 40 మంది, గోప్యత
భోపాల్: దేశంలో అలజడి సృష్టించిన వ్యాపం కిల్లింగ్ స్కాం కేసు దర్యాప్తు వేగవంతం అయింది. వ్యాపం స్కాం కుంభకోణం దర్యాప్తు చెయ్యడానికి 40 మంది సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం నుండి కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. సీబీఐ ప్రత్యేక బృందం అధికారులు మధ్యప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో విచారణ చేసి వివరాలు సేకరించడానికి సిద్ధమయ్యారు. అయితే దర్యాప్తు చేస్తున్న అధికారుల వివరాలు గోప్యంగా ఉంచారు.
సీబీఐ బృందానికి నేతృత్వం వహిస్తున్న అధికారి పేరు సైతం బయటకు రానివ్వకుండా జాగ్రతలు తీసుకున్నారు. మొదట బీహార్ కు చెందిన ఒక సీనియర్ సీబీఐ అధికారి ప్రత్యేక బృందానికి నేతృత్వం వహిస్తున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలు అవాస్తవం అని సీబీఐ వర్గాలు అంటున్నాయి. మధ్యప్రదేశ్ లో వివిధ ఉద్యోగాలకు కోసం నిర్వహించిన పోటి పరీక్షలలో భారీగా గోల్ మాల్ జరిగింది. అంతే కాకుండ వివిధ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇదే వ్యాపం స్కాం.
ఈ వ్యాపం కుంభకోణంలోని నిందితులు, సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు కోనసాగుతున్నది.












Click it and Unblock the Notifications