వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CBSE సంచలన నిర్ణయం: ఒకే ఏడాది వేర్వేరు సిలబస్‌తో రెండు విడతల్లో బోర్డు పరీక్షలు -పూర్తి వివరాలివే

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి దెబ్బకు విద్యారంగం తీవ్రంగా ప్రభావితం కావడం, రాబోయే రోజుల్లో మరిన్ని వేవ్ లు తలెత్తితే చదువులు కుదేలయ్యే అవకాశాలుండటంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యా శాఖ పరిధిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తన నూత సిలబస్ విధానాన్ని సోమవారం ప్రకటించింది.

షాకింగ్: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదు -రేవంత్ రెడ్డిని లోపలేస్తాం: ఫిరాయింపు ఎమ్మెల్యేలుషాకింగ్: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదు -రేవంత్ రెడ్డిని లోపలేస్తాం: ఫిరాయింపు ఎమ్మెల్యేలు

2021-22 విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సీబీఎస్ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కరోనా భయాల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరాన్ని రెండు విభాగాలుగా విభజించినట్లు వెల్లడించింది. ఈ మేరకు 50 శాతం సిలబస్‌ చొప్పున 10, 12 తరగతులకు రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు.

 CBSE BIG announcement: academic year divided into two For Class 10, 12 from 2021-22

కొత్త విధానం ప్రకారం ఒకే విద్యా సంవత్సరంలో రెండు సార్లు బోర్డు పరీక్షలుంటాయి. ఏదైనా అవాతరంతో ఒక పరీక్ష రద్దయితే, వచ్చిన మార్కులని తీసుకుని మొత్తం విడుదల చేస్తారు. ఈ రెండు టర్ముల్లో సిలబస్ కూడా వేరే విధంగా ఉంటుంది. మొదటి అర్థ సంవత్సరానికి 50శాతం సిలబస్ ఉంటుంది. రెండవ టర్మ్ కి మిగతా యాభైశాతం సిలబస్ ఉంటుందని సీబీఎస్ఈ పేర్కొంది. కాగా,

జగన్ ధిక్కారం: హెలికాప్టర్‌ ఇస్తాం, వెళ్లి చూడండి -సీమ ఎత్తిపోతలపై తొలిసారి ఎన్జీటీకి కేసీఆర్ సర్కార్జగన్ ధిక్కారం: హెలికాప్టర్‌ ఇస్తాం, వెళ్లి చూడండి -సీమ ఎత్తిపోతలపై తొలిసారి ఎన్జీటీకి కేసీఆర్ సర్కార్

మారిన విధానంలో పరీక్షల సమయం 90నిమిషాలుగానే ఉంటుందని, మార్కింగ్ స్కీమ్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ ని సీబీఎస్ఈ తయారు చేస్తుందని, సీబీఎస్ఈ నియమించిన అధికారుల సమక్షంలోనే పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లో తొలి విడత పరీక్షలు, వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో రెండో విడత బోర్డు పరీక్షలు జరుపనున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. 10, 12వ తరగతులకు టెర్మ్‌ల వారీగా సిలబస్‌ను ఈ నెలాఖరున ప్రకటిస్తామని చెప్పింది. ఈ విషయాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ సైతం నిర్ధారించారు.

 CBSE BIG announcement: academic year divided into two For Class 10, 12 from 2021-22

Recommended Video

CBSE Board Exam 2021 Not To Be Cancelled: Ramesh Pokhriyal | Ooneindia Telugu

సీబీఎస్ఈ విద్యార్థుల ఇంటర్నల్ అసెస్మెంట్, ప్రాజెక్ట్ వర్స్‌ను మరింత విశ్వసనీయంగా నిర్వహించేలా ప్రయత్నిస్తున్నామని, కరోనా నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో బోర్డు పరీక్షలు నిర్వహించలేనందున ఈ ఏడాది రెండు విడతలుగా బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించిందని మంత్రి పోఖ్రియాల్ పేర్కొన్నారు. ఒకవేళ మార్చిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే 2గంటల బోర్డు పరీక్షను పెట్టాలని కూడా సీబీఎస్ఈ భావిస్తుంది.

English summary
The Central Board of Secondary Education (CBSE) on Monday unveiled a special assessment scheme for class 10 and 12 board exams for academic session 2021-22 in view of the coronavirus pandemic. Under the new scheme, academic session will be divided into two terms with 50 per cent syllabus in each term. First term exams to be held in November-December and second term examinations will be scheduled in March-April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X