సీబీఎస్ఈ పేపర్ల లీకేజీ: ఇద్దరు టీచర్లు సహ ముగ్గురి అరెస్ట్

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పేపర్ల లీక్ కుంభకోణంలో ఢిల్లీ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు టీచర్లతో పాటు ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు కూడ ఉన్నారు. సిబిఎస్ఈ పేపర్ల లీకేజీ విషయమై ఇప్పటికే దేశ వ్యాప్తంగా విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు.

సిబిఎస్ఈ పేపర్ల లీకేజీ వ్యవహరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పేపర్ల లీకేజీ వెనుక ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం నాడు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

CBSE Paper Leak: Delhi Police arrest two teachers, coaching centre owner

వీరిలో ఇద్దరు టీచర్లతో పాటు ఓ కోచింగ్ సెంటర్‌ ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. ఔటర్ ఢిల్లీ ప్రాంతానికి చెందిన రిషబ్, రోహిత్‌లు పేపర్ల ఇమేజ్‌లను తీసి వాటిని ఓ కోచింగ్ సెంటర్‌కు పంపారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు తాకిర్‌ విద్యార్ధులకు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు సీబీఎస్ఈ పేపర్ల లీకేజీలో చేతిరాతతో కూడ పేపర్ కూడ బహిర్గతమైంది. ఈ కేసు విచారణ కూడ పురోగతిలో ఉందని అధికారులు ప్రకటించారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంటకు ముందే ప్రశ్నపత్రం లీక్ కావడం కలకలం రేపింది.

పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అవుతోందని ఓ విద్యార్ధి సీబీఎస్ఈ బోర్డుకు మెయిల్ చేశారు. ఈ క్రమంలో విద్యార్ధితో పాటు ఆయన తండ్రిని కూడ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసు విషయమై ఇప్పటికే సుమారు 60 మందిని పోలీసులు ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+