బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

CD Girl: రాసలీలల కేసు, టైమ్ కావాలి, మాజీ మంత్రి, మాకు టైమ్ కావాలి, అమ్మాయి తండ్రి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పీజీ సుందరి రాసలీలల కేసు వ్యవహారంలో కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరైనారు, నాలుగు రోజులు పాటు తనకు టైమ్ ( సమయం) ఇస్తే మీరు అడిగే ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెబుతానని ఆ అధికార పార్టీ నాయకుడు పోలీసులకు మనవి చేశారు. ఓకే గ్రాంటెడ్ అంటూ పోలీసులు ఆ మాజీ మంత్రికి సమయం ఇచ్చేశారు. ఇదే సమయంలో మాజీ మంత్రితో రాసలీలలు సాగించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ సుందరి తండ్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ తన కుమార్తెను నాలుగు రోజుల పాటు ప్రశాంతంగా ఉదిలేయాలని, తరువాత ఆమెను సిట్ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించాలని చెప్పడంతో అసలు కథ నాలుగు రోజుల తరువాత మొదలు కానుంది.

Illegal affair: అక్క కోసం వెళ్లి ఆంటీతో జల్సా, బావకు డౌట్ వచ్చి కిటికిలో ?, అంతే కథ!Illegal affair: అక్క కోసం వెళ్లి ఆంటీతో జల్సా, బావకు డౌట్ వచ్చి కిటికిలో ?, అంతే కథ!

 రాసలీలల సీడీ సుందరి ఎఫెక్ట్

రాసలీలల సీడీ సుందరి ఎఫెక్ట్

తను మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని, అపార్ట్ మెంట్ కు పిలిపించుకుని ఉద్యోగం ఇస్తానని నమ్మించి తన జీవితంతో చెలగాటం ఆడాడని ఆరోపిస్తూ పీజీ సుందరి బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులకు ఆమె తరపు న్యాయవాది సహాయంతో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

 మాజీ మంత్రికి నోటీసులు

మాజీ మంత్రికి నోటీసులు

రాసలీలల సీడీలో ఉన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న మాజీ మంత్రి సోమవారం బెంగళూరులోని ఆడుగోడిలోని టెక్నికల్ సెల్ (పోలీసు విభాగం) అధికారుల ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిసింది.

 నాలుగు రోజులు టైమ్ కావాలి

నాలుగు రోజులు టైమ్ కావాలి

కబ్బన్ పార్క్ పోలీసులు, టెక్నికల్ సెల్ పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలకు రమేష్ జారకిహోళి సమాధానం ఇచ్చారని తెలిసింది. ఇదే సమయంలో తనకు నాలుగు రోజులు కాలావకాశం ఇస్తే మీరు అడిగే ప్రశ్నలకు పూర్తి సమాధానం ఇస్తానని రమేష్ జారకిహోళి పోలీసు అధికారులకు చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీన మళ్లీ విచారణకు హాజరుకావాలని పోలీసు అధికారులు సూచించడంతో రమేష్ జారకిహోళి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 అమ్మాయి తండ్రి ఏం చెప్పారంటే ?

అమ్మాయి తండ్రి ఏం చెప్పారంటే ?

రాసలీలల సీడీలో ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి తండ్రి మాజీ మిలటరి ఉద్యోగి. సోమవారం బెళగావిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె ఇప్పుడు చాలా ఒత్తిడి గురైఉందని, సిట్ అధికారులు, కోర్టు ఆమెను ప్రశాంతంగా నాలుగు రోజులు వదిలేయాలని, తరువాత ఆమె ఇచ్చే స్టేట్ మెంట్ తీసుకోవాలని మనవి చేశారు.

 రాజకీయ శత్రువులు లేరు

రాజకీయ శత్రువులు లేరు

తమకు సిట్ దర్యాప్తు మీద నమ్మకం ఉందని సీడీ సుందరి తండ్రి మీడియా ముందు స్పష్టం చేశారు. రాజకీయంగా తమకు ఎవరు శత్రువులు కాదని, అలాగని ఎవ్వరూ మిత్రులు లేరని, డీకే. శివకుమార్ గురించి మాకు పెద్దగా తెలీదని సీడీ సుందరి కుటుంబ సభ్యులు అన్నారు. మొత్తం మీద ఇటు మాజీ మంత్రి రమేష్ జారకిహోళి నాలుగు రోజులు టైమ్ కావాలని అడగడం, మా అమ్మాయిని నాలుగు రోజులు ప్రశాంతంగా వదిలేయాలని ఆమె కుటుంబ సభ్యులు చెప్పడంతో నాలుగు రోజుల తరువాత అసలు కథ మొదలౌతుందని తెలిసింది.

English summary
CD Girl: Ramesh Jarakiholi has sought time for four days to appear before the SIT to answer the questions in the CD case. SIT directed to appear on April 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X