మే 18 వరకే సమయం..ఆ తర్వాత ఏం జరుగుతుందో..బాంబు పేల్చిన పాకిస్తాన్
భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన ప్రకటన కొత్త చర్చలకు దారితీసింది. మే 18 వరకు మాత్రమే కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేయడంతో, ఇరు దేశాల మధ్య మళ్లీ సైనిక ఘర్షణ తలెత్తే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఊపందుకున్నాయి.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రకటన వెనుక లోతైన కుట్ర దాగి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ ఏదో వ్యూహం పన్నుతోందని భావిస్తున్నారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ ఇషాక్ దార్, డీజీఎంఓ స్థాయిలో జరిగిన చర్చల ద్వారా మొదట మే 12 వరకు, తర్వాత మే 14 వరకు, చివరకు మే 18 వరకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తెలిపారు. రాజకీయ స్థాయిలో చర్చలు జరిగితేనే సైనిక ఒప్పందం పూర్తిస్థాయిలో అమలవుతుందని ఆయన పేర్కొనడం గమనార్హం.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత మూడు వారాల్లో భారత్ తీసుకున్న కఠిన చర్యల పట్ల పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం పాకిస్తాన్‌ను కలవరపరుస్తోంది. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, సింధు ఒప్పందంపై చర్చించేది లేదని భారత్ తేల్చి చెప్పింది. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై మాత్రమే చర్చలు ఉంటాయని స్పష్టం చేసింది.
దీంతో పాకిస్తాన్, సింధు ఒప్పందంపై చర్చించేందుకే భారత్‌ను రాజకీయ చర్చల్లోకి లాగాలని ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మే 18 తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications