CEC Press Meet : తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల- తేదీలివే..!

ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ ఘడ్ లో అసెంబ్లీల పదవీకాలం ముగుస్తన్ననేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని ప్రకటిస్తున్నారు.

cec announced dates for five state assembly polls later this year- here are details


మిజోరంలో నవంబర్ 7వ తేదీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఛత్తీస్ ఘడ్ లో రెండుదశల్లో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు ఉంటాయని ఈసీ ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో నవంబర్ 7న ఒకే దశలో ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఛత్తీస్ ఘడ్లో నవంబర్ 23న ఎన్నికలు ఉంటాయన్నారు. తెలంగాణలో నవంబర్ 30 న ఎన్నికలు ఉంటాయన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న నిర్వహిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పూర్తి ప్రక్రియ డిసెంబర్ 5కల్లా ముగుస్తుందన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే హక్కు కల్పిస్తున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ ఐదు రాష్టాల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఐదు రాష్టాల్లో కలిపి 1.77 లక్షల పొలింగ్ స్టేషన్లు అందుబాటులో ఉంచామన్నారు. గత 40 రోజులుగా ఐదు రాష్టాల్లో విస్తృతంగా పర్యటించి రాజకీయ పార్టీలు, అధికారులతో చర్చించాక షెడ్యూల్ ఖరారు చేసినట్లు సీఈసీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలు పారదర్శకంగా, కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.

ఐదు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఇలా ఐదు రాష్ట్రాల్లో 5.6 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని తెలిపింది. వీరితో కలిపి ఛత్తీస్ ఘడ్ లో 2.03 కోట్ల మంది ఓటర్లు, రాజస్తాన్ లో 5.25 కోట్ల మంది, మిజోరంలో 8.52 లక్షల మంది ఓటర్లు,తెలంగాణలో 3.71 కోట్ల మంది ఓటర్లు, మధ్యప్రదేశ్ లో 5.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో తక్షణం ఎన్నిక కోడ్ అమల్లోకి వచ్చినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+