వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపఎన్నికల అభ్యర్ధులకు ఈసీ షాక్-కీలక మార్గదర్శకాలు-ఇక అక్కడా కోడ్, కోవిడ్ ఆంక్షలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా త్వరలో మూడు లోక్ సభ స్ధానాలతో పాటు 30 అసెంబ్లీ స్ధానాల్లో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. వీటి కోసం ఇప్పటికే అభ్యర్ధులు, పార్టీలు ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నాయి. అయితే తాజా కోవిడ్ పరిస్ధితులు, ఇతర అంశాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్ధులు, పార్టీలకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కానీ వాటిని వారు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అభ్యర్ధులకు గట్టి షాక్ తగిలినట్లయింది.

దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు

దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు

దేశవ్యాప్తంగా మూడు లోక్ సభ స్ధానాలతో పాటు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్వరలో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం ఈసీ రెండు వారాల క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం అభ్యర్ధులు, రాజకీయ పార్టీలకు కొన్ని మార్గదర్సకాలు కూడా విడుదల చేసింది. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఏపీలోని బద్వేలు అసెంబ్లీ స్ధానంతో పాటు తెలంగాణలోని హుజురాబాద్ స్ధానానికీ అక్టోబర్ 30న ఉపఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలో కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గకపోవడం, ఇతరత్రా కారణాలతో ఈ ఉపఎన్నికల కోసం ఎన్నికల సంఘం అభ్యర్ధులు, రాజకీయ పార్టీలకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. వాస్తవానికి ఎన్నికల కోడ్ ప్రకారం ఈ మినహాయింపులు సాధారణంగా ఇతర ఎన్నికల్లో అమలు కావు.

ఉపఎన్నికల్లో మినహాయింపులు

ఉపఎన్నికల్లో మినహాయింపులు

దేశవ్యాప్తంగా జరిగే ఉపఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధులు, రాజకీయ పార్టీలకు ఊరటనిచ్చేలా ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. వాటిలో ప్రధానంగా కోవిడ్ ఆంక్షలతో పాటు ఎన్నికల కోడ్ ను సైతం ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలకే పరిమితం చేసింది. అంటే ఈ నియోజకవర్గాలకు బయట మాత్రం రాజకీయ కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించింది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఆంక్షలు కూడా కేవలం ఉపఎన్నికల నియోజకవర్గాలకే పరిమితం చేసింది. దీంతో అభ్యర్ధులకు ఇప్పటివరకూ ఊరట లభించింది.

మినహాయింపుల దుర్వినియోగం

మినహాయింపుల దుర్వినియోగం

కోవిడ్ వ్యాప్తి, ఇతరత్రా కారణాలతో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మినహాయింపుల్ని ప్రస్తుతం రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు దుర్వినియోగం చేస్తున్నారు. నియోజకవర్గాల వరకే కోడ్ అమల్లో ఉండటంతో దాని చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పాగా వేసి ఓటర్లను మభ్య పెడుతున్నారు. అలాగే కోవిడ్ నిబంధనల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు, అభ్యర్ధులు అధికారుల నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీనిపై విచారణ జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అభ్యర్ధులు, పార్టీలపై ఈసీ కొరడా

అభ్యర్ధులు, పార్టీలపై ఈసీ కొరడా

ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ మినహాయింపుల్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలతో పాటు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లోనూ కోడ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే కోవిడ్ ఆంక్షల్ని కూడా చుట్టు పక్కల నియోజకవర్గాల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్ధానిక ఎన్నికల అధికారులకు ఆదేశాలు పంపింది.

 ఇక అభ్యర్దులకు చుక్కలే

ఇక అభ్యర్దులకు చుక్కలే


ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఇప్పటివరకూ ఈసీ ఇచ్చిన మినహాయింపుల్ని వాడుకుంటూ చెలరేగిపోతున్న అభ్యర్ధులు, పార్టీలకు ఈసీ తాజా ఆదేశాలు షాకిచ్చాయి. ముఖ్యంగా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పాగా వేసి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఈసీ ఆదేశాలతో చెక్ పడింది. అదే సమయంలో కోవిడ్ ఆంక్షల్ని సైతం చుట్టు పక్కల నియోజకవర్గాలకు వర్తింపజేయడంతో అక్కడికి వెళ్లి గుంపులు గుంపులుగా మంతనాలు జరిపే వీల్లేకుండా పోతోంది. ఇప్పటికే ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు అందడంతో ఉపఎన్నికల నియోజకవర్గాల్లో ఇవాళ్టి నుంచి ప్రచార ఆంక్షలు అమలు కానున్నాయి. దీంతో రాబోయే వారం రోజుల్లో వారికి చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
the central election comission has ordered to implement poll code and covid 19 restrictions in and around byelection constitutuencies in wake of complaints.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X