ఎన్నికల్లో గెలిచింది భార్య.. ఆసుపత్రి పాలైంది భర్త, కారణం అదేనా?
మీరట్ : భార్య గెలుపుని హర్షించలేని భర్తలూ ఉంటారని ఈ ఘటన రుజువు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య విజయం సాధించిన ఆనందంలో విషం కలిపిన మిఠాయిలు తిని ఓ భర్త ఆసుపత్రి పాలయ్యాడు.
అసలేం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణానికి చెందిన షాహిద్ అబ్బాసీ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు. తాజాగా జరిగిన మీరట్ మున్సిపల్ ఎన్నికల్లో షాహిద్ భార్య నజ్రీన్ విజయం సాధించింది.

దీంతో అతని కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. అందరూ సంబరాల్లో ఉండగా షాహిద్‌కు రక్తపు వాంతులు ప్రారంభమయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషం కలిపిన మిఠాయి తిన్నందువల్లే అతనికి రక్తపు వాంతులు అయ్యాయని వైద్యులు తేల్చి చికిత్స చేస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురు సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాహిద్ ను పరామర్శించారు. వైద్యుల నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని మీరట్ పోలీసులు చెప్పారు.
భార్య ఎన్నికల్లో గెలవడాన్ని భరించలేక షాహిద్ స్వయంగా విషం కలిపిన మిఠాయి తిని ప్రాణాలు తీసుకోవాలని భావించాడా? లేకపోతే ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనా? ప్రస్తుతానికి ఇది సస్పెన్స్‌గా మారింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications