కోర్టులో మోగిన సెల్‌ఫోన్: అధికారికి రూ. 10వేల జరిమానా

కటక్: కోర్టులో మొబైల్ ఫోన్ రింగైనందుకు రాష్ట్ర ఉన్నత విద్య అదనపు కార్యదర్శి ముకుందా కిషన్‌కు ఒరిస్సా హైకోర్టు రూ. 10వేల జరిమానా విధించింది. జెజె మహావిద్యాలయ(చండీఖోల్) భోదనా సిబ్బందికి ఇవ్వాల్సిన జీతభత్యాల విషయంలో జరుగుతున్న విచారణ నిమిత్తం సదరు అధికారి కోర్టు ముందు హాజరయ్యారు.

కాగా, జస్టిస్ బిఆర్ సారంగి విచారిస్తున్న సమయంలోనే కిషన్ సెల్‌ఫోన్ రింగవడం మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన న్యాయమూర్తి అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అంతేగాక, రూ. 10వేల జరిమినా చెల్లించాలని ఆదేశించారు.

Cellphone rings in HC, officer fined

‘జరిమానా చెల్లించిన తర్వాత అదనపు కార్యదర్శి తన సెల్‌పోన్‌ను తీసుకెళ్లవచ్చని జస్టిస్ సారంగి ఆదేశించారు' అని పిటిషనర్ తరపు న్యాయవాది సుశాంత తెలిపారు. ఆ తర్వాత కేసు విచారణను వాయిదా వేసిన కోర్టు, తదుపరి విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని జడ్జి ఆదేశించారు.

కాగా, తనను క్షమించాలని, తనకు విధించిన రూ. 10వేల జరిమానాను రూ. 2వేలకు తగ్గించాలని కిషన్ కోర్టును వేడుకున్నారు. దీంతో కోర్టు జరిమినాను రూ. 2వేలకు తగ్గించింది. వెంటనే కిషన్ ఆ మొత్తన్ని కోర్టుకు చెల్లించి తన మొబైల్ ఫోన్‌ను తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+