లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ పై నిషేధం.. ఉగ్రవాద సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం!!
దేశంలో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న సంస్థలపై, ఉగ్రవాదం కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంస్థలపై కేంద్ర ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలని, ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి కలిసికట్టుగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే అనేక మార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో ఉగ్రవాద మూలాలు ఉన్న సంస్థలపై, ఉగ్రవాదులకు ఆర్థిక వనరులను అందిస్తున్న సంస్థలపై, కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై ఉక్కు పాదం మోపుతున్నారు.

ఉగ్రవాద మూలాలున్న సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం
ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను దాని అనుబంధ సంస్థలను చట్టవిరుద్ధమైన సంస్థలని కేంద్రం ప్రకటించి, ఐదేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. వారు ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తున్నారు అన్న కారణంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేయగా, కేంద్ర ప్రభుత్వం ఆ పై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై అయిదేళ్ల పాటు నిషేధం విధించి వేటు వేసింది. ఇక తాజాగా పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

లష్కరే తోయిబా అనుబంధ శాఖ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పై నిషేధం
1967 చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా యొక్క శాఖ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ సంస్థ 2019లో ఉనికిలోకి వచ్చింది. ఇది కాశ్మీర్ లోయలో కాశ్మీరీ పండిట్ లు, వలస కార్మికులతో సహా, భద్రతా దళాలు, పౌరులపై దాడులు చేయడంలో కీలకంగా వ్యవహరించిందని కేంద్రం పేర్కొంది.

ఆన్లైన్ ద్వారా ఉగ్రవాద కార్యాకలాపాలు.. అమాయకుల హత్యల్లో టీఆర్ఎఫ్
ఆన్లైన్ ద్వారా యువతని రిక్రూట్ చేస్తోందని, ఉగ్రవాద కార్యకలాపాలను పెంపొందించడానికి పనిచేస్తోందని, పాకిస్తాన్ నుండి జమ్మూ కాశ్మీర్ లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఉగ్రవాదులకు కావాల్సిన సహకారాన్ని అందిస్తుందని కేంద్రం పేర్కొంది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్లో అమాయక పౌరుల హత్యలకు, భద్రతా సిబ్బందిని హతమార్చడానికి ప్లాన్ చేసినందుకు అనేకమంది టీఆర్ఎఫ్ సభ్యులపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

నిషేధంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన
సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా యువతను ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షిస్తుందని, ఉగ్రవాద సంస్థల లో చేరడానికి ప్రేరేపిస్తుంది అని పేర్కొంది. టిఆర్ఎఫ్ కార్యకలాపాలు జాతీయ భద్రతకు, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే నిషేధం విధించింది. ఇలాంటి సంస్థల ఏరివేతకు కేంద్రం ఎన్ఐఏ ని రంగంలోకి దింపి మరీ తనిఖీలు నిర్వహిస్తోంది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications