ఉగ్రవాదంపై విరుచుకుపడుతున్న కేంద్రం: వరుస నిషేధాలు; తాజాగా పీఏఎఫ్ఎఫ్ పై నిషేధం!!

దేశంలో ఉగ్రవాదంపై, ఉగ్రవాద మూలాలపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం, ఉగ్రవాద సంస్థలతో అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలపై నిషేధం విధిస్తోంది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. వరుసగా ఉగ్రవాద కార్యాకలాపాలకు సహకరిస్తున్న సంస్థలపై నిషేధం విధించటం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.

జైషే మొహమ్మద్ కు చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ పై నిషేధం

జైషే మొహమ్మద్ కు చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ పై నిషేధం

ఇప్పటికే దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై దాడులు చేసి, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకారం అందిస్తున్న కారణంగా ఐదు సంవత్సరాల పాటు దీనిపై నిషేధం విధించింది. నిన్నటికి నిన్న లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా నిర్ధారించి నిషేధం విధించింది. ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్ మరియు ఇతర ప్రాంతాలలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నందుకు ఉగ్రవాద సంస్థ అయిన జైషే మొహమ్మద్ యొక్క ప్రాక్సీ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ను కేంద్రం శుక్రవారం నాడు నిషేధించింది

ఉగ్రవాద సంస్థగా పేర్కొని నిషేధం విధించిన కేంద్రం

ఉగ్రవాద సంస్థగా పేర్కొని నిషేధం విధించిన కేంద్రం

ఇప్పటికే లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పై నిషేధం విధించటంతో పాటు, పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ పై నిషేధం విధించిన కేంద్రం జమ్మూకాశ్మీర్లో ఇతర రాష్ట్రాల నుంచి పనిచేస్తున్న భద్రతా బలగాలకు, రాజకీయ నేతలకు, పౌరులకు వీరి నుండి నిరంతర బెదిరింపులు ఎదురవుతున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. జమ్ము కాశ్మీర్ తోపాటు భారత దేశంలోని ప్రధాన నగరాల్లో హింసాత్మక ఉగ్రవాద చర్యలను చేపట్టడం కోసం, సామాజిక మాధ్యమాల ద్వారా పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఇతర ఉగ్రవాద సంస్థలతో కలిసి కుట్రలు చేస్తోందని కేంద్రం వెల్లడించింది.

ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్న కేంద్రం .. అందుకే నిషేధం

ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్న కేంద్రం .. అందుకే నిషేధం

పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఇతర ఉగ్రవాద అనుబంధ సంస్థలతో కలిసి ఆయుధాలు, పేలుడు పదార్థాలను నిర్వహించడంలో ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, శిక్షణ కోసం, యువతను ఆకట్టుకునే విధంగా సోషల్ మీడియా ను వాడుకుంటూ పని చేస్తుందని పేర్కొంది. పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఉగ్రవాద కార్యకలాపాలలో కూడా పాల్గొంటున్నట్టు గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఈ కారణాలతో చట్ట విరుద్ధ కార్యకలాపాలు చట్టం 1967 సెక్షన్ 35 లోని సబ్ సెక్షన్ 1 లోని క్లాజ్ ఏ ద్వారా అందించబడిన అధికారాలను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ను నిషేధిత సంస్థగా ప్రకటించింది. దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా మట్టుబెట్టడం కోసం చాలా కాలంగా సుదీర్ఘ ఆపరేషన్ కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉగ్రవాద సంస్థల పై, వాటికి అనుబంధంగా పనిచేస్తున్న ఇతర సంస్థల పై ఉక్కుపాదం మోపడం ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+