Onion Price: బఫర్ స్టాక్ విడుదల చేసిన కేంద్రం.. కిలో ఉల్లి రూ.35..!

ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. నెల క్రితం వరకు కిలో రూ.30 నుంచి రూ.40 పలికిన కిలో ఉల్లి ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.60 పలుకుతోంది. దీంతో సామాన్యులు ఉల్లి కొనలేని పరిస్థితి నెలకొంది. ఇక మిర్చిల బండి, పానీ పూరి వద్ద ఉల్లి వినియోగాన్ని తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని తొలగించిన తర్వాత రిటైల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పెరిగిన ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్ర చర్యలు చేపట్టింది. తమ వద్ద బఫర్ స్టాక్ విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా సబ్సిడీ రిటైల్ అమ్మకాలను విస్తరించే యోచనతో ఢిల్లీ, ఇతర ముఖ్య నగరాల్లోని హోల్‌సేల్ మార్కెట్‌లలో కేంద్రం తన బఫర్ స్టాక్ విడుదల చేయనుంది. బఫర్ స్టాక్ ఉల్లిపాయలను విడుదల చేయడం ప్రారంభించినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే సోమవారం తెలిపారు. "ఎగుమతి సుంకాన్ని ఎత్తివేసిన తర్వాత మేము ధరల పెరుగుదలను ఊహించాము. 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ తో ఉల్లి ధరలను అదుపులో ఉంచుతామని భావిస్తున్నాము" అని ఖరే పేర్కొన్నారు.

Center has released buffer stock to reduce rising onion prices

జాతీయ సగటు కంటే ఎక్కువ ధరలు ఉన్న నగరాలపై దృష్టి సారించి, భారతదేశం అంతటా ఉల్లిపాయల రిటైల్ అమ్మకాలను కిలోకు రూ. 35 లకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం ఢిల్లీలో రిటైల్ ఉల్లి ధర సెప్టెంబర్ 22న కిలో రూ.55గా ఉంది. ఏడాది క్రితం ఇదే సమయంలో కిలో ఉల్లి రూ.38గా ఉంది. ఇక ముంబైలో కిలో ఉల్లి రూ.58 ఉండగా.. చెన్నైలలో రూ.60గా ఉంది.

సెప్టెంబర్ 5 నుంచి ఢిల్లీ, ఇతర రాష్ట్ర రాజధానులలో NCCF, NAFED మొబైల్ వ్యాన్లు, అవుట్‌లెట్ల ద్వారా ప్రభుత్వం ఉల్లిపాయలను కిలో రూ.35 చొప్పున విక్రయిస్తోంది.గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా ఎక్కువ విస్తీర్ణం ఉందని పేర్కొంటూ ఖరే రాబోయే ఖరీఫ్ ఉల్లి పంటపై ఆశాభావం వ్యక్తం చేశారు. వంట నూనె దిగుమతిపై పన్ను పెంచడంతో వంట నూనె ధరలు పెరిగాయి. వంట నూనె లీటర్ కు రూ. 10 నుంచి రూ.20 పెరిగింది. ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 20 శాతానికి, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 32.5 శాతానికి పెంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+