వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఆ పని చేస్తే ప్రోత్సాహకాలు కూడా .. మరో బాంబు పేల్చిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి కష్టాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి తగినట్లుగా అడుగులు వేస్తున్న కేంద్రం నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను, పోర్టులను, విమానాశ్రయాలను, స్టీల్ కంపెనీలను ప్రైవేటు పరం చేయడానికి రంగంలోకి దిగింది. ఇక దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ తో పాటు అనుబంధ సంస్థలు కూడా ప్రైవేటీకరిస్తాం .. మరోమారు బాంబు పేల్చిన కేంద్రంవిశాఖ స్టీల్ ప్లాంట్‌ తో పాటు అనుబంధ సంస్థలు కూడా ప్రైవేటీకరిస్తాం .. మరోమారు బాంబు పేల్చిన కేంద్రం

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం

ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించే ప్రత్యామ్నాయ మార్గాలను చూడాల్సిన కేంద్రం ఆ దిశగా కాకుండా, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం పై వివిధ రాష్ట్రాలలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను, విశాఖ పోర్టును ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ లోని అధికార పార్టీ సైతం కార్మికుల పోరాటానికి మద్దతుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణకు డిమాండ్ చేస్తుంది.

మరోమారు ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ సంచలనం

మరోమారు ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ సంచలనం

ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో ప్రైవేటీకరణ విషయంలో ఈ రోజు కేంద్ర మంత్రి మరోమారు ప్రైవేటీకరణపై కుండబద్దలు కొడుతున్నారు. తాజాగా లోక్ సభలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మరో కొత్త విషయాన్ని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్రైవేటుకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా .. అదే చేస్తే ఆ రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు

ప్రైవేటుకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా .. అదే చేస్తే ఆ రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు

రాష్ట్రాలలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే కేంద్రం ప్రోత్సాహకాలను కూడా ఇస్తోందని ఆయన ప్రకటించారు. నష్టాల బాటలో ఉన్న సంస్థలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన, నోడల్ ఏజెన్సీగా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ పనిచేస్తుందని, సంస్థల మూసివేత పై విధి విధానాలను సవరించి త్వరలో నోటిఫికేషన్ అని ప్రకటించారు. నష్టాల్లో ఉన్న సంస్థలను మూసివేత కంటే

ప్రైవేటుకు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

English summary
Today, the Union Minister is once again pushing for privatization in the ongoing parliamentary sessions. Union Minister of State for Heavy Industries Arjun Ram, who recently answered questions raised by Lok Sabha MPs Komatireddy Venkatereddy and Manne Srinivas Reddy, revealed another new thing. He said not only the central public sector undertakings but also the state public sector undertakings would be privatized. He also announced that the Center would give incentives to privatize public sector undertakings in the states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X