ఈసీ సంచలన నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఉఫ్.. తెలుగు రాష్ట్రాల్లో..
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 345 రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం డీ లిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న పార్టీలను గుర్తించి చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్.
దేశవ్యాప్తంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు తీసుకుంటోంది. 2019 నుండి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని, గుర్తింపు లేని 345 రాజకీయ పార్టీలను డీ లిస్ట్ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది. వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న పార్టీలను గుర్తించి చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్.

సాధారణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లను సాధించాలి. అలా 6 శాతం ఓట్లు రాబట్టని పార్టీలు.. అసలు ఎన్నికల్లోనే పోటీ చేయని పార్టీలపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఈసీ సమాయత్తం అయింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పార్టీలు 345 ఉన్నట్లు ఈసీ గుర్తించింది. ఆ రాజకీయ పార్టీలను డీ లిస్ట్ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది ఎన్నికల సంఘం.












Click it and Unblock the Notifications