వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట్, ఐఐటీ, జేఈఈ పరీక్షల తేదీలు ప్రకటించిన కేంద్ర సర్కార్ .. ఎప్పుడు ఏ పరీక్షంటే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మే 3 వరకు రెండో విడత లాక్ డౌన్ కొనసాగగా ఇప్పుడు తాజాగా మూడో విడత లాక్ డౌన్ కూడా మొదలైంది. నిన్నటి నుండి ఈ నెల 17 వరకు మరో విడత లాక్‌డౌన్‌పొడిగిస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించి పలు మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చి లాక్ డౌన్ కొనసాగిస్తున్న కేంద్ర సర్కార్ తాజాగా మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

భారతదేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐఐటీ (జెఈఈ ), అలాగే మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) జూలై 18 నుంచి జూలై 26 మధ్య జరుగుతుందని, దాదాపు 3 మిలియన్ల మంది విద్యార్థుల ఆందోళనలను తగ్గించటానికి ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది.

జెఈఈ (మెయిన్స్), రెండు అంచెల ప్రవేశ పరీక్ష .. మొదటి పరీక్ష జూలై 18 మరియు జూలై 23 మధ్య నిర్వహించనున్నారు. జులై 18, 20, 21, 22 మరియు 23 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఆగస్టులో నిర్వహించనున్నారు. ఇక నీట్ పరీక్ష జూలై 26 న నిర్వహించబడుతుందని మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు.

central government announces dates of NEET, IIT and JEE exams

నీట్‌పై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చించామని, తేదీలపై వారు కూడా అంగీకరించారని మంత్రి చెప్పారు. దాదాపు 1.6 మిలియన్ల మంది వైద్య విద్య అభ్యసించాలని ప్రిపేర్ అవుతున్న వారు నీట్ పరీక్షకు హాజరవుతుండగా, 1.3 మిలియన్లు జేఈఈ మెయిన్స్‌కు హాజరవుతారు.

ఇక జెఈఈ మెయిన్స్ ముగిసిన తర్వాత అందులో క్వాలిఫై అయిన వారికి , ఆగస్టులో జెఈఈ అడ్వాన్స్డ్ జరుగుతుంది" అని పోఖ్రియాల్ చెప్పారు. జెఈఈ మెయిన్స్ మరియు నీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. లాక్డౌన్ వల్ల కలిగే అంతరాయాల కారణంగా నాలుగు నెలల ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లలో కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరానికి ఈ పరీక్షల షెడ్యూల్ సంకేతం ఇచ్చింది .

English summary
The union government on Tuesday said joint entrance exam (JEE) for admission into top engineering colleges and the National Eligibility cum Entrance Test (NEET) for admission into medical colleges will be held between 18 July and 26 July, ending concerns of nearly 3 million students over the exams.While JEE (Mains), the first leg of the two-tier JEE entrance will take place in multiple windows between 18 July and 23 July, NEET exam will be conducted on 26 July, human resource development minister Ramesh Pokhriyal said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X