ఆ క్లెయిమ్ లపై రైతులకు కేంద్రం శుభవార్త.. వారికి షాక్!
లోక్ సభలో రైతు సంక్షేమం కోసం కేంద్రం చేస్తున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల గురించి సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టిందని ఆయన వెల్లడించారు.
రైతుల బీమా క్లెయిమ్ లపై మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
రైతులకు బీమా క్లెయిమ్‌లు సకాలంలో అందేలా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. గతంలో రైతులు పంట నష్టపోయిన తర్వాత బీమా క్లెయిమ్‌లు తమ ఖాతాల్లో జమ కావడానికి నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని కేంద్రమంత్రి గుర్తు చేశారు. ఈ ఆలస్యం రైతులను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని పేర్కొన్నారు.

నిర్ణీత గడువులో క్లెయిమ్ ఇవ్వకుంటే 12 శాతం వడ్డీతో ఇవ్వాలి
ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులకు సంబంధించి పంట బీమా సంస్థలు 21 రోజుల్లోపు క్లెయిమ్‌లను పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత గడువులో క్లెయిమ్ చెల్లించడంలో విఫలమైతే, సంబంధిత బీమా కంపెనీలు రైతులకు 12 శాతం వడ్డీతో పాటు మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంతో బీమా సంస్థలపై బాధ్యత మరింత పెరుగుతుందని ఆయన లోక్ సభా వేదికగా చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాల వలన ఆలస్యం అయితే వారు వడ్డీతోనే ఇవ్వాలి
అదేవిధంగా, క్లెయిమ్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాల వలన ఆలస్యం జరిగితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ చర్యలతో రైతులకు న్యాయం జరుగుతుందని, బీమా వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని ఆయన తెలిపారు.
బీమా సమస్యలపై రైతులు ఇలా ఫిర్యాదు చెయ్యాలి
క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌కు సంబంధించి సమస్యలు ఎదురైన రైతులు Krishi Rakshak Portal ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సూచించారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు రెండు లక్షల 71 వేల ఫిర్యాదులు అందినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆ ఫిర్యాదులను ప్రభుత్వం పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కొత్త మార్పులు అమల్లోకి రావడంతో రైతులకు త్వరితగతిన బీమా సాయం అందే అవకాశాలు పెరిగాయన్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!













Click it and Unblock the Notifications