యుద్దం వేళ వంట గ్యాస్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం - పరిమితులు, ఆంక్షలు..!!
ఇజ్రాయల్ - ఇరాన్ యుద్దం ప్రభుత్వం వంట గ్యాస్.. ఆయిల్ సరఫరా పైన పడుతోంది. యుద్దం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితుల్లో కేంద్రం అప్రమత్త మైంది. పెట్రోల్, డీజిల్ సరఫరా లో రేషనింగ్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. నిల్వలు పూర్తిగా ఉండటంతో ఆందోళన అవసరం లేదని చెబుతోంది. అదే సమయంలో ఆయిల్ కంపెనీలకు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వంట గ్యాస్ బుకింగ్ విషయంలో ఆయిల్ కంపెనీలు పరిమితులు విధించాయి. దీంతో.. అనూహ్యంగా డిమాండ్ పెరిగింది.
యుద్దం వేళ ఆయిల్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎల్పీజీ సరఫరాలో అంత రాయం లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ సరఫరాలో గృహ వినియోగదారులకే ప్రాధాన్యం ఇవ్వాలని చమురు మార్కెటింగ్ సంస్థలను ఆదేశించింది. పరిశ్రమలు, పెట్రోకెమికల్ రంగాలకు ఎల్పీజీ సరఫరాలో తాత్కాలిక పరిమితులు విధించాలని సూచించింది. ప్రస్తుతం ఎల్పీజీ దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఖతార్ నుంచి భారత్ ప్రధానంగా ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇరాన్ దాడులు చేస్తుండటంతో ఖతార్ ఎల్పీజీ సరఫరాను నిలిపివేసింది. అటు భారత్‌కు గ్యాస్ విక్రయిస్తామంటూ ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ముందుకొచ్చాయి. యుద్దం వేళ వంట గ్యాస్ కొరత తప్పదనే ప్రచారం వేళ వినియోగదారులు పెద్ద సంఖ్యలో బుకింగ్స్ చేసుకుంటున్నారు. దీంతో.. సరఫరా పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో.. ఆయిల్ కంపెనీలు తమ ఏజెన్సీల ద్వారా అనధికారికంగా వంట గ్యాస్ బుకింగ్స్ పై పరిమితులు అమలు చేస్తున్నారు.

గ్యాస్ బుకింగ్ పై పరిమితులు
రెండు సిలిండర్లు ఉన్న గ్యాస్ వినియోగదారుడికి బుకింగ్ గడువు 30 రోజులు.. ఒక సిలిండర్ ఉన్న వినియోగదారుడికి 21 రోజుల తరువాతనే బుకింగ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు బుకింగ్ పోర్టల్స్.. యాప్ ల సాఫ్ట్ వేర్ లోనూ మార్పులు చేసారు. దీని ద్వారా సిలిండర్ పొందిన 21 రోజుల తరువాత మాత్రమే మరో సిలిండర్ కోసం బుకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ప్రభుత్వం.. ఆయిల్ కంపెనీలు మాత్రం వంటగ్యాస్ సరఫరాలో ఎలాంటి సమస్య లేదని చెబుతున్నాయి. ఇప్పుడు ఇంకా యుద్దం కొనసాగుతున్న వేళ.. సెప్టెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. దీంతో.. కేంద్రం ఆయిల్ కంపెనీలను అప్రమత్తం చేసింది. ఇతర అవసరాల కంటే ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించే గ్యాస్ సరఫరాకు వీలుగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!












Click it and Unblock the Notifications