పెట్రోల్, గ్యాస్ సంక్షోభం తీవ్రం- కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు

అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ వస్తోంది. నాలుగో వారంలోకి ప్రవేశించిన తర్వాత కూడా దీనికి బ్రేకులు పడట్లేదు. ఈ యుద్ధానికి ఎపిక్ ఫ్యూరీగా పేరు పెట్టింది అమెరికా. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు.

ఈ పరిణామాలన్నింటినీ పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రత్యేకంగా కేంద్రమంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యప్రాచ్య సంఘర్షణల వల్ల తలెత్తే సమస్యలను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఇది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వాన్ని వహిస్తారు. ఇందులో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీతో సహా ఇతర మంత్రులు సభ్యులుగా ఉన్నారు.

Central Govt Forms Inter-Ministerial Group to Monitor Middle East Conflict Rajnath Singh to Head

ఇదే సమయంలో కేంద్రం పెట్రోల్ ఎక్సైజ్ సుంకాన్ని మూడు రూపాయలు, డీజిల్‌పై ట్యాక్స్ ను పూర్తిగా తొలగించింది. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును లీటరుకు రూ. 21.50 పైసలుగా నిర్ణయించింది. విమాన ఇంధనంపై కొత్తగా 50 రూపాయల ఎక్సైజ్ ట్యాక్స్ ను ప్రకటించింది గానీ, మినహాయింపుల వల్ల ఇది రూ.29.50 పైసలకే పరిమితమైంది. ఫలితంగా పౌర విమానయాన రంగానికి కొంత ఊరట లభిస్తుంది.

ఈ సుంకాల తగ్గింపు ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో తెరముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌పై టెహ్రాన్ దిగ్బంధనం సంక్షోభాన్ని తీవ్రం చేశాయి. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో ఐదవ వంతు (రోజుకు 20-25 మిలియన్ బ్యారెళ్లు) ఈ జలసంధి గుండా వెళ్తుంది. అంతకుముందు, భారతదేశం ఈ చమురులో 12-15% కొనుగోలు చేసింది.

అటు పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదనలు చేసినా యుద్ధానికి బ్రేకులు పడట్లేదు. ఇంకా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇరాన్‌లోని యజ్ద్‌లో గల క్షిపణులు, సముద్ర మైన్‌ల ఉత్పత్తికి సంబంధించిన ఇరాన్ ప్రభుత్వ ప్రధాన కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. ఈ స్థావరం.. అధునాతన క్షిపణుల ప్రణాళిక, తయారీ, నిల్వకు ఉపయోగపడేదని ఐడీఎఫ్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+