వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూళ్లు,కాలేజీలకు 9-12 విద్యార్థులు... ఎస్‌ఓపీ విడుదల చేసిన కేంద్రం.... ఈ నియమాలు తప్పనిసరి...

|
Google Oneindia TeluguNews

అన్‌లాక్4.0 మార్గదర్శకాల్లో భాగంగా 9-12వ తరగతి విద్యార్థులు స్కూళ్లు,కాలేజీలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఎస్ఓపీని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. టీచర్లు,విద్యార్థులు పాటించాల్సిన మార్గదర్శకాలను అందులో పేర్కొంది. 9-12 తరగతుల విద్యార్థులు స్కూళ్లు,కాలేజీలకు వెళ్లవచ్చునని లేదా ఆన్‌లైన్ క్లాసుల ద్వారా పాఠాలు వినాలని సూచించింది. ఆప్షన్‌ను విద్యార్థుల నిర్ణయానికే వదిలిపెట్టింది. స్కూళ్లు,కాలేజీలకు వెళ్లడం స్వచ్చంద నిర్ణయమని పేర్కొంది. అందుకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి లిఖితపూర్వక ఆమోదం తప్పనిసరి అని చెప్పింది.

Recommended Video

Schools Reopening Guidelines For Classes 9 To 12, తల్లిదండ్రుల కు ఇష్టమైతేనే ! || Oneindia Telugu
సోడియంతో హైపోక్లోరైడ్‌తో శానిటైజేషన్ తప్పనిసరి...

సోడియంతో హైపోక్లోరైడ్‌తో శానిటైజేషన్ తప్పనిసరి...

కేవలం కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల ఉన్న స్కూళ్లకు మాత్రమే రీఓపెన్‌కు అనుమతి ఉంటుంది.కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలోని విద్యార్థులను స్కూళ్లకు అనుమతించరు. విద్యార్థులు,టీచర్లు కంటైన్‌మెంట్ జోన్లను సందర్శించరాదు. స్కూల్స్ రీఓపెన్‌కి ముందు లేబరోటరీస్‌తో సహా క్లాస్ రూమ్స్ అన్నింటినీ 1శాతం సోడియం హైపోక్లోరైడ్ సొల్యూన్‌తో శానిటైజ్ చేయాలి. క్వారెంటైన్ కేంద్రాలుగా ఉపయోగించబడ్డ స్కూళ్లలో డీప్ క్లీనింగ్,శానిటైజేషన్ చేయాలి. టీచింగ్-నాన్ టీచింగ్ స్టాఫ్ కలిపి 50శాతం సిబ్బందితోనే స్కూళ్లను నిర్వహించాలి.

బయోమెట్రిక్‌కు ప్రత్యామ్నాయం...

బయోమెట్రిక్‌కు ప్రత్యామ్నాయం...

స్కూల్ యాజమాన్యాలు బయోమెట్రిక్ అటెండెన్స్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులు,టీచర్లు తప్పనిసరిగా 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. దాని ప్రకారమే విద్యార్థుల సీటింగ్ కూడా ఉండాలి. స్కూల్ ఆవరణలోనే హ్యాండ్ వాష్ సదుపాయం కల్పించాలి. క్యూ పద్దతి పాటించేటప్పుడు,స్టాఫ్ రూమ్స్,లైబ్రరీల్లోనూ భౌతిక దూరం తప్పనిసరి. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా యాక్టివిటీ నిర్వహించాలనుకుంటే కరోనా ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి.

అవగాహన కల్పించేలా పోస్టర్లు...

అవగాహన కల్పించేలా పోస్టర్లు...

ఎటువంటి కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే స్కూల్ ఆవరణలోకి అనుమతిస్తారు. ఎవరైనా టీచర్ లేదా విద్యార్థిలో కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణం సమీపంలోని హెల్త్ కేర్ సెంటర్‌కు వెళ్లాలి. స్కూల్ గోడలపై కరోనా పట్ల అవగాహన కల్పించే పోస్టర్లను అతికించాలి. సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్లోకి అనుమతించరాదు. ఒకవేళ స్కూల్ యాజమాన్యమే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పిస్తే దాని శానిటైజేషన్ బాధ్యత కూడా యాజమాన్యానిదే. 1శాతం సోడియం హైపోక్లోరైట్‌తో వాహనాలను శానిటైజ్ చేయాలి.

ఎవరైనా అనారోగ్యానికి గురైతే...

స్కూల్ ఫ్లోర్స్‌ను ప్రతీరోజూ శుభ్రంగా ఉంచాలి. టాయిలెట్స్‌లో తప్పనిసరిగా సోప్‌ను అందుబాటులో ఉంచాలి. స్కూల్ చైర్స్,డోర్స్,లిఫ్టులు,బెంచీలు,తదితర వాటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ఫ్రీ టైమ్ లేదా స్కూల్ వదిలిపెట్టిన సమయంలో విద్యార్థులు గుమిగూడకుండా వారికి అవగాహన కల్పించాలి. టీచర్స్ లేదా విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే... మిగతావాళ్లకు దూరంగా ఆ వ్యక్తిని ఓ గదిలో ఐసోలేట్ చేయాలి. వెంటనే సమీప హెల్త్ సెంటర్‌ను సంప్రదించాలి. ఒకవేళ ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలితే ఆ గదిని శానిటైజేషన్ చేయించాలి.

English summary
The Students from Class 9-12 will have the option of attending classes remotely/virtually or physically only on a voluntary basis for guidance from their teachers subject to written permission of parent / guardian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X