ప్రొఫెసర్లు, లెక్చరర్లకు దీపావళి బొనాంజా: 7వ పే కమిషన్ ఫలాలు
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర, యూజీసీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకు దీపావళి పండగ ముందే వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏడో వేతన సంఘం ప్రయోజనాలను వారికీ అమలు చేయాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 7.58 లక్షల మంది ఆచార్యులకు ప్రయోజనం కలగనుంది.
'329 రాష్ట్ర విశ్వ విద్యాలయాలు, 12,912 కళాశాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు 2016, జనవరి 1 నుంచి ఏడో వేతన సంఘం ప్రయోజనాలు దక్కుతాయి. కేంద్ర నిధులుతో నడిచే డీమ్డ్ యూనివర్సిటీలు, 43 కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకు ప్రయోజనాలు అందుతాయి' అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

వేతనాల పెరుగుదల దాదాపు 22-28 శాతం వరకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పెంపుదల కోసం సెప్టెంబర్ నెలలో మోడీ ప్రభుత్వం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో 22మంది సభ్యులున్నారు. ఇది ఇలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలు ప్రవేశ పెట్టనుంది. నైపుణ్యాభివృద్ధి కోసం సంకల్ప్, స్ట్రైవ్ పథకాలు తీసుకొస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications