మారిన జనగణన రూపు-స్వయంగా నమోదుకు ఛాన్స్-డిజిటల్ సేకరణకూ కేంద్రం ఆమోదం
దేశవ్యాప్తంగా 10 ఏళ్లకోసారి జరిగే జనగణన 2021లో చేపట్టాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి ఆటంకాలతో అది కాస్తా ముందుకుసాగలేదు. దీంతో కేంద్రం, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కనీసం ఈ ఏడాది అయినా జనగణనను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా జనాభా లెక్కల వివరాలను స్వయంగా జనంతోనే నమోదు చేయించే ప్రక్రియతో పాటు డిజిటల్ విధానంలోనూ వివరాలు తీసుకునేలా నిబంధనల్ని సవరించారు. ఈ మేరకు కేంద్రం సవరణలకు ఆమోదముద్ర వేసింది.
జనగణన వివరాలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో తీసుకోవడానికి, నిల్వ చేయడానికి, అలాగే ప్రజల నుంచి స్వీయ-గణనను అనుమతించడానికి 1990లో రూపొందించిన జనాభా గణన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. కోవిడ్ కారణంగా నిరవధికంగా వాయిదా వేయబడిన దశాబ్దాల జనాభా గణన కార్యక్రమం మొదటిసారిగా డిజిటల్ మోడ్‌తో పాటు పేపర్ షెడ్యూల్‌ల ద్వారా నిర్వహించబోతున్నారు. జనగణన 2021 తొలి దశ జాతీయ జనాభా రిజిస్టర్ ఎన్.పి.ఆర్.ని అప్‌డేట్ చేయడంతో పాటుగా ఇళ్ల వివరాలు, హౌసింగ్ సెన్సస్ 2020 ఏప్రిల్-సెప్టెంబర్ నుంచి జరగాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావంతో నిరవధికంగా వాయిదా పడింది. ఈ జనగణన రెండో దశ మార్చి 5, 2021 నాటికి ముగియాలి. కానీ అది కూడా సాధ్యం కాలేదు. దీంతో కేంద్రం తాజా నిర్ణయాలు తీసుకుంది.

ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్‌ల ద్వారా దాదాపు 650-800 మంది వ్యక్తుల వివరాలను సేకరించే బాధ్యతను ఎక్కువగా ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా ఉన్న దాదాపు 30 లక్షల మంది ఎన్యూమరేటర్‌లకు అప్పగించారు. మార్చి 11న రిజిస్ట్రార్-జనరల్ ఆఫ్ ఇండియా గెజిట్‌లో సవరించిన జనగణన నిబంధనలను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. దీని ప్రకారం ఓ వ్యక్తి స్వీయ-గణన ద్వారా జనాభా గణన షెడ్యూల్‌ను పూర్తి చేసి సమర్పించేలా అవకాశం కల్పించారు. ఎలక్ట్రానిక్ విధానంలో జనాభా గణన చేపట్టి స్వీయ గణనకు అనుమతిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ, నిబంధనలను సవరించి అధికారికంగా ప్రకటన జారీ చేసింది.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications