పరీక్షల కుంభకోణం కేసు: మధ్యప్రదేశ్ గవర్నర్ రాజీనామా
భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఫారెస్ట్ గార్డు పరీక్షల కుంభకోణం కేసులో ఇరుక్కున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర హోం శాఖ పదవినుంచి వైదొలగాల్సిందిగా కోరడంతో రాజీనామా చేశారు.
అంతక మందు కేంద్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా పదవిలో కొనసాగడం సరికాదని పేర్కొంది. ఫారెస్ట్ గార్డుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డ కేసులో రామ్ నరేశ్ యాదవ్ ప్రమేయంపై సాక్ష్యాలు ఉన్నాయని చెబుతూ, రాష్ట్రపతి అనుమతి తీసుకొని, స్పెషల్ టాస్క్ ఫోర్స్ మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
అంతేకాకుండా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 420తో పాటు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఫారెస్ట్ గార్డుల నియామకం కోసం పరీక్ష నిర్వహించిన మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపీపీఈబీ) ఉన్నతాధికారులకు గవర్నర్ ఐదుగురి పేర్లను సిఫారసు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఎంపీపీఈబీ కుంభకోణంలో దర్యాప్తు చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉందంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎం ఖ్వాన్ విల్కర్, న్యాయమూర్తి అలోక్ అరధేతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 20న స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎంపీపీఈబీ కుంభకోణంలో రాజకీయ నేతలతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాలు పంచుకున్నారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ధన్ రాజ్ యాదవ్ అరెస్ట్‌తో ఇందులో గవర్నర్ పాత్ర కూడా ఉన్నట్లు బయటపడింది. దీంతో పాటు ఒప్పంద ఉపాధ్యాయుల నియామకం కోసం గవర్నర్ కుమారుడు శైలేశ్ యాదవ్‌కు డబ్బులు అందినట్లు ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications