ఢిల్లీకి భారీగా తరలివస్తున్న జనం..! అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్రం కీలక ఆదేశం..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి నిరసనకారులు ఢిల్లీకి బయలుదేరారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు వారు రైళ్లు, బస్సులు, వ్యక్తిగత వాహనాల్లో బయలుదేరారు. దీంతో ఇప్పటికే ఢిల్లీలో భారీ ఎత్తున బలగాల్ని మోహరించి సీజేపీ నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం (Centre) రాష్ట్రాలకు కీలక విజ్ఞప్తి చేసింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన నిరసన ప్రదర్శన కోసం, నిరసనకారులు జాతీయ రాజధాని వైపు రాకుండా అడ్డుకోవాలని అన్ని రాష్ట్రాల్ని కేంద్రం కోరింది.

ఢిల్లీ ఆందోళనల ఎఫెక్ట్..! రూటు మార్చేస్తున్న ఏపీ పార్టీలు..! ఎటూతేల్చుకోలేని ఒక్కరు..!
ఢిల్లీ ఆందోళనల ఎఫెక్ట్..! రూటు మార్చేస్తున్న ఏపీ పార్టీలు..! ఎటూతేల్చుకోలేని ఒక్కరు..!

నిరసనకారుల్ని రాజధానికి రాకుండా అడ్డుకోవడానికి ఢిల్లీ పోలీసులతో సమన్వయం చేసుకుని, తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఢిల్లీలోకి అనధికారికంగా ప్రవేశించడానికి సీజేపీ మద్దతుదారులు చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా, తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని హోంశాఖ తన లేఖలో డీజీపీలకు పిలుపునిచ్చింది. అలాగే రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల నిఘా సంస్థలు, సరిహద్దు రవాణా అధికారులు, ఢిల్లీ పోలీసులు నిరంతరంగా, లైవ్ నిఘా సమాచారాన్ని పంచుకోవాలని కూడా ఆదేశించింది.

Centre Asks States to Stop People from Travelling to Delhi for CJP Protest
Abhijeet Dipke: విమానంలోనే అభిజీత్ దిప్కే అరెస్ట్-ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత..!
Abhijeet Dipke: విమానంలోనే అభిజీత్ దిప్కే అరెస్ట్-ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత..!

కేంద్ర హోం కార్యదర్శి డీజీపీలకు రాసిన లేఖలో.. అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద సీజేపీ ప్రతిపాదించిన భారీ సమీకరణ వల్ల తలెత్తే తీవ్రమైన శాంతిభద్రతలు, ప్రజా భద్రత పరిణామాలను ప్రముఖంగా ప్రస్తావించారు. సీజేపీ తరఫున సమర్పించిన అభ్యర్థనను కచ్చితంగా తిరస్కరించినట్లు, జంతర్ మంతర్ లో సభను నిషేధించినట్లు ఆ లేఖలో తెలిపారు. ఆ ప్రాంతంలో సభలను నియంత్రించే రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని 2018 సుప్రీంకోర్టు ఉత్తర్వు నిర్దేశిస్తోందని హోం కార్యదర్శి ఆ ఉత్తర్వును కూడా ప్రస్తావించారు. శాంతిభద్రతలు, ప్రజా భద్రతను కాపాడటం అనేది రాజీపడలేని రాజ్యాంగపరమైన ఆవశ్యకత అని మంత్రిత్వ శాఖ భావిస్తుందన్నారు. చట్టబద్ధమైన పాలనను నిలబెట్టడానికి పై వాటిని కఠినంగా, రాజీలేకుండా అమలు చేయాలని కోరారు. గత సంఘటనల సమయంలో చట్టబద్ధమైన ఆదేశాలను పాటించడంలో విఫలమైన చరిత్ర సీజేపీకి, దానికి మద్దతు ఇచ్చే పార్టీలు, సంస్థలు, వ్యక్తులకు ఉందని హోంశాఖ ఆరోపించింది. గతంలో వారు వివిధ రాష్ట్రాల నుండి ఢిల్లీలోకి జరిపిన సమీకరణల వలన ప్రజా భద్రతలకు గణనీయమైన అంతరాయం కలగడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లిందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+