కుబేర మూవీ ఎఫెక్ట్..? వారికోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
రోడ్లపై ఎక్కడ చూసినా బిచ్చగాళ్లు కనిపిస్తూ ఉంటారు. ధర్మం చేయండి అంటూ వేడుకుంటూ ఉంటారు. అలాగే దేవాలయాలు, మసీదులు, చర్చిల బయట కూడా బిచ్చగాళ్లు దర్శనమిస్తూ ఉంటారు. ఇక ఇతర టూరిస్టు ప్రదేశాల్లోనూ కనిపిస్తూ ఉంటారు. అయితే సమాజం వాళ్లను చిన్న చూపు చూస్తూ ఉంటుంది. ఆఖరికి కుక్కల కన్నా హీనంగా చూస్తూ ఉంటుంది. వాళ్లకు అడుక్కోవడం తప్ప వేరే పని లేదంటూ తిట్టుకుంటూ వెళ్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బిచ్చగాళ్లు కూడా సమాజంలో మనుషులే అని చాటిచెప్పేలా వారికోసం సరికొత్త పథకం తీసుకొచ్చింది.
బిచ్చగాళ్లకు కూడా సమాజంలో గౌరవ మర్యాదలను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం స్మైల్ అనే పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కు తాజాగా రూ. 37 కోట్లు కేటాయించింది. బిచ్చగాళ్లు వీధుల్లో, రోడ్లపై అడుక్కోకుండా వారి కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా తగు విధివిధానాలు రూపొందించింది. అంతేకాక బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించి వారి ఆలనా పాలనా చూసే విధంగా కేంద్రం సంస్కరణలు తీసుకొచ్చింది.
📅 Save the Date – July 11, 2025!
— Ministry of Social Justice & Empowerment, GOI (@MSJEGOI) July 10, 2025
Getting Ready for an impactful One-Day Workshop & Training Program on the SMILE Sub-Scheme: Comprehensive Rehabilitation of Persons Engaged in the Act of Beggary, at Brilliant Convention Centre, Indore. pic.twitter.com/lMi6eeaDdd
ఈ పథకాన్ని తొలుత దర్శనీయ స్థలాలు, టూరిస్టు సైట్లు ఉన్న నగరాల్లో అమలు చేయనున్నారు. ఎక్కడైతే బిచ్చగాళ్లు ఎక్కువగా ఉంటారో అక్కడ ఈ స్మైల్ పథకాన్ని అమలు చేస్తే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక ఆయా ప్రాంతాల్లోని దేవాలయాల సిబ్బంది, మత పెద్దలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని బిచ్చగాళ్లను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది.

ఆయా ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం బిచ్చగాళ్లను గుర్తించి పునరావాస కేంద్రానికి తరలించి వారి వయసు, ఆరోగ్యం, జెండర్.. ఇలా అన్నింటిని లిస్ట్ చేయనున్నారు. మరికొంత మంది బిచ్చగాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పించి ఉపాధి హామీ పథకం.. తదితర పథకాల్లో పనులు కల్పించనున్నారు. ఇలా ఒక్కో పునరావాస కేంద్రంలో 50 మందిని ఉంచి.. వారికి అన్ని రకాల సౌకర్యాలు అందించనున్నారు. ఈ పథకానికి కేంద్రం మొత్తం రూ. 100 కోట్లు కేటాయించగా విడతల వారీగా రూ. 30 కోట్లు అందిస్తోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications