చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ఇకపై ప్రతి ఏటా ఆగస్టు 23వ తేదీన..: కేంద్రం నోటిఫికేషన్ జారీ

న్యూఢిల్లీ: 2023 ఆగస్టు 23వ తేదీ. దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే రోజు అది. ఆ రోజే చందమామ మన చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర.. విజయ తీరాలకు చేరింది. దిగ్విజయమైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. మాడ్యుల్ చందమామ దక్షిణధృవంపై అడుగు మోపింది ఆ రోజే.

రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (లిబ్స్), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ ఇయానోస్ఫియర్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్..వంటి పేలోడ్స్ కీలక డేటాను సేకరించిన విషయం తెలిసిందే.

Centre declares August 23 of every year as National Space Day

ఈ ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన కీలక సమాచారన్ని సేకరించింది ఇస్రో. చందమామ దక్షిణ ధృవంపై రసాయన, ఖనిజ నిల్వలు భారీగా ఉన్నట్లు గుర్తించింది. ప్రత్యేకించి- సల్ఫర్ నిల్వలు భారీగా ఉన్నట్లు నిర్ధారించింది. మనిషి జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ సైతం ఉందనే విషయాన్ని ఇస్రో నిర్ధారించింది ఈ ప్రయోగం ద్వారానే.

ఆక్సిజన్, సల్ఫర్‌, అల్యూమినియం, క్యాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని లిబ్స్ పేలోడ్ గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. అత్యధిక శక్తి గల లేజర్ కిరణాలను లిబ్స్ ప్రసారం చేయగలదు. చంద్ర శిలలు, లేదా మట్టి లక్షణాలను తెలుసుకోవడానికి లిబ్స్‌ను వినియోగించింది ఇస్రో.

చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చంద్రయాన్ 3 జాబిల్లిపై అడుగుపెట్టిన రోజైన ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవం (National Space Day)గా జరుపుకోవాలని నిర్ణయించిది. ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఆ రోజునాడు ప్రత్యేకంగా సైన్స్ ఎగ్జిబిషన్లు, సెమినార్లను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పర్సనల్ డిపార్ట్‌మెంట్ అదనపు కార్యదర్శి సంధ్యా వేణుగోపాల్ శర్మ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థలు, కళాశాలలు, యూనివర్శిటీల్లో అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందారోజున. దీనివల్ల యువతలో స్పేస్ పట్ల మరింత అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+