coronavirus: విపత్తుగా ప్రకటించిన కేంద్రం, మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు, వారికి వైద్య ఖర్చులు
న్యూఢిల్లీ: దేశంలో వేగంగా వ్యాపిస్తూ ఇద్దరి ప్రాణం తీసిన ప్రాణాంతకమైన కరోనావైరస్(కొవిడ్-19)ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా గుర్తించింది. అంతేగాక, కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనావైరస్ బారని పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది కేంద్ర హోంశాఖ. కరోనావైరస్ సోకి మరణించిన వారి కుటుంబాలకు విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా సహాయమందించడం జరుగుతోంది.

కరోనావైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా, దేశంలో కరోనాబారినపడిన వారిసంఖ్య 84కు చేరుకుంది. ఇప్పటికే కరోనాసోకి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని బెంగళూరులో ఒకరు, దేశ రాజధాని ఢిల్లీలో మరొకరు మృతి చెందారు.
కాగా, కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. సినిమా థియేటర్లు, మాల్స్ కూడా బంద్ చేశారు. ఇప్పటి వరకు దేశంలో రెండు కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 5500 మందికిపైగా మరణించారు. లక్ష50వేల మందికిపైగా కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ఇలావుండగా, పద్మ అవార్డులపైనా కరోనా ప్రభావం పడింది. ఏప్రిల్ 3న రాష్ట్రపతి భవన్‌లో జరగాల్సిన అవార్డుల ప్రదానోత్సవం కూడా వాయిదా పడింది. .
మంచిర్యాల వ్యక్తికి కరోనా..
తెలంగాణలో రాష్ట్రంలోని మంచిర్యాలలో కరోనా కలకలం రేపింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం అతడు ఇటలీ నుంచి రావడం గమనార్హం. వచ్చిన నాటి నుంచి ఆ వ్యక్తికి జలుబు, దగ్గు, జ్వరం ఉంది. దీంతో అతడ్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడికి రక్త నమూనాలు సేకరించిన డాక్టర్లు ల్యాబ్ కి పంపారు. రిపోర్టు వచ్చిన తర్వాతే కరోనాపై నిర్ధారిస్తామని వైద్యులు తెలిపారు.ఇది ఇలావుండగా, మహారాష్ట్రలోని నాగపూర్ ఆస్పత్రి నుంచి ఐదుగురు కరోనా అనుమానితులు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications