పండోరా పేపర్స్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, సీబీడీటీ ఆధ్వర్యంలో దర్యాప్తు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రముఖుల గోప్యపు ఆర్థిక లావాదేవీలను బయటకు తెచ్చిన పండోరా పేపర్స్ కలకలం రేపుతున్నాయి. అనేక దేశాల్లో ప్రముఖులు పన్నులు కట్టకుండా విదేశీ బ్యాంకుల్లో దాచిన ఖాతాల వివరాలను ఆదివారం రాత్రి పండరో పేపర్స్ పేరిట వెలుగులోకి రావడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పండోరా పేపర్స్ కు సంబంధించిన కేసులను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఆధ్వర్యంలో బహుళ ఏజెన్సీల బృందంతో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసుల దర్యాప్తునకు సీబీడీటీ నేతృత్వం వహిస్తుండగా, ఈడీ, ఆర్బీఐ, ఎఫ్ ఐయూ సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో కీలకంగా వ్యవహరించనున్నారు.
చట్టపరంగా దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోనున్నట్లు సీబీడీటీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కొన్ని పేర్లు మాత్రమే మీడియాలో వస్తున్నాయని, అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి (ఐసీఐజే) వెబ్‌సైట్‌లో కూడా పేర్లను, అన్ని సంస్థల ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం విడుదల చేయలేదని తెలిపింది. దీనిపై విచారణ పూర్తికాగానే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కేసుల దర్యాప్తులో భాగంగా పన్ను ఎగవేతదారుల సమాచారం పొందడం కోసం విదేశాల్లో ఉన్న అధికార పరిధిని కూడా ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించింది.
కాగా, ఐదేళ్ల క్రితం పనామా పేపర్ల పేరుతో జరిగిన ఘటన కన్నా శక్తివంతమైన పండోరా పేపర్ల పేరుతో ప్రముఖులు పన్ను ఎగవేతకు పాల్పడ్డట్లు బయటకు రావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ జాబితాలో 91 దేశాలకు చెందిన వందలాది ప్రస్తుత, మాజీ ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, దౌత్యాదికారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి(ఐసీఐజే) ఆదివారం రాత్రి వెల్లడించింది.

ఈ జాబితాలో పారిశ్రామిక వేత్తలతోపాటు దాదాపు 300 మందికిపైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. 117 దేశాల్లోని 150కిపైగా వార్తా సంస్థలకు చెందిన 600 మంది రిపోర్టర్లు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలించి ఈ గుట్టును రట్టు చేశారు. విశ్లేషించిన మొత్తం సమాచారం పరిమాణం 2.94 టెరాబైట్ల మేర ఉండటం గమనార్హం.
Recommended Video
తాజాగా విడుదలైన పండోరా పేపర్లతో..ట్రస్టుల రూపాల్లో ఎలా పన్ను ఎగవేత జరుగుతుందో వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లోని ఓ కోర్టులో దివాలా తీసినట్లు ప్రకటించిన ప్రముఖ వ్యాపారవేత్త అనీల్ అంబానీ, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ, బయోకాన్ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా భర్త, కెట్ దిగ్గజసం సచిన్ టెండ్కూలర్ సహా పలువురి పేర్లు పండోరా పేపర్స్ లో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications