చైనాతో ఆ లింక్స్: గుర్తించిన కేంద్ర హోం శాఖ: అత్యవసరంగా సంచలన నిర్ణయం: 200కు పైగా

చైనాతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ను నిషేధించనుంది. ఈ ప్రక్రియను చేపట్టినట్లు హోం, ఐటీ మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి.

న్యూఢిల్లీ: ప్రస్తుతం అమెరికా- చైనా మధ్య స్పై బెలూన్ల యుద్ధం నడుస్తోంది. అమెరికా గ‌గ‌న‌త‌లంలోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్ కంట్రీకి చెందిన స్పై బెలూన్ క‌ల‌క‌లం వ్యవహారం కలకలం రేపుతోంది. సుమారు మూడు బస్సుల పరిమాణం కలిగిన ఈ అతి పెద్ద బెలూన్‌ ను తమ దేశ రహస్యాలు, ఇతర గుట్టుమట్లను తెలుసుకోవడానికే చైనా ప్రయోగించిందని అమెరికా ఆరోపిస్తోంది. తమ దేశ గగనతలంపై తిరుగాడుతోన్న ఈ బిగ్ స్పై బెలూన్ ను కూల్చివేసింది.

 బెలూన్ల కలకలం వేళ..

బెలూన్ల కలకలం వేళ..

ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ బెలూన్ ను కూల్చేయాలంటూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. దీనితో అమెరికా వైమానిక దళాధికారులు యుద్ధ విమానాల సహాయంతో దాన్ని కూల్చివేశారు. పేల్చేసిన తరువాత దాని శకలాలు భూమిపై పడకుండా జాగ్రత్త పడ్డారు. అట్లాంటిక్ సముద్ర గగనతలంపైకి తీసుకొచ్చి పేల్చివేశారు. ఇది చైనా ఆగ్రహానికి కారణమైంది.

200లకు పైగా యాప్స్ పై..

200లకు పైగా యాప్స్ పై..

ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. చైనాతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న 200లకు పైగా యాప్స్ ను నిషేధించింది. ఈ నిషేధ ప్రక్రియను తక్షణమే చేపట్టింది. ఈ మేరకు కేంద్ర హోం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బెట్టింగ్, లోన్స్

బెట్టింగ్, లోన్స్

నిషేధానికి గురయ్యే జాబితాలో 138 బెట్టింగ్ యాప్స్, 94 లోన్ యాప్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆయా యాప్స్ అన్నీ విస్తృతంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తోన్నాయి. ఆ యాప్స్ వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం, దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు చైనాకు చేరుతోన్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీనికి సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు పంపించింది.

 అర్జెంట్ అండ్ ఎమర్జెన్సీ..

అర్జెంట్ అండ్ ఎమర్జెన్సీ..

ఇప్పటికిప్పుడు.. అత్యవసరంగా ఆయా యాప్స్ అన్నింటినీ నిషేధించాలని సూచించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అందిన వెంటనే నిషేధ ప్రక్రియను ప్రారంభించింది ఐటీ శాఖ. ఆయా యాప్స్ అన్నీ కూడా దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు విఘాతం కలిగించే పరికరాలను కలిగి ఉన్నాయని తెలిపింది. అలాంటివి వినియోగించడం ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 69కు విరుద్ధమని పేర్కొంది.

చట్ట వ్యతిరేకం..

చట్ట వ్యతిరేకం..

బెట్టింగ్, లోన్ యాప్స్ పై పలు రాష్ట్రాలు నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ ను కూడా ఏపీ ప్రభుత్వం ఇదివరకే నిషేధించిన విషయం తెలిసిందే. బెట్టింగ్ పైనా నిషేధం ఉంది. కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, కేబుల్ టీవీ నెట్‌వర్క్ కంట్రోల్ యాక్ట్ 1995, ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్ తో పాటు వాటి అనుబంధ కార్యకలాపాలపై నిషేధం ఉంది. ఆయా చట్టాలకు అనుగుణంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+