జగన్ ఫార్ములాను స్టడీ చేస్తోన్న కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఇందులో కీలక మార్పులను ప్రతిపాదించింది. నిర్మల సీతారామన్ సారథ్యాన్ని వహిస్తోన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై అధ్యయనం సాగిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర మంత్రివర్గం సమక్షానికి రానున్నాయి.
కొత్త పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చేసే విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ- ఏపీ మోడల్‌ను అనుసరించే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తోన్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తరహాలోనే ఈ జాతీయ పెన్షన్ సిస్టమ్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ రూపకల్పనలో కేంద్రం ఏపీ మోడల్ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను అనుసరించే అవకాశం ఉందని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ దీనిపై కసరత్తు మొదలు పెట్టిందని పేర్కొంది.
ఉద్యోగులు తాము చివరిగా తీసుకున్న బేసిక్ జీతంలో 40 నుంచి 50 శాతం మేర గ్యారంటీని పొందే పథకాన్ని ఈ కమిటీ పరిశీలిస్తోంది. బహిరంగ మార్కెట్‌తో అనుసంధానంగా ఉంటుంది ఈ ప్రతిపాదిత ఎన్పీఎస్. కార్పస్ లోటు ఉంటే- కేంద్ర ప్రభుత్వం దాన్ని భర్తీ చేస్తుంది. అలాగే- పెన్షనర్లు వారి చివరిగా తీసుకున్న జీతంలో 40 నుంచి 50 శాతం మొత్తాన్ని గ్యారంటీగా పొందే వెసలుబాటు కల్పిస్తుంది.
ప్రతిపాదిత ఈ కొత్త పెన్షన్ సిస్టమ్‌లో కూడా ఉద్యోగులు ఇదివరకట్లా కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రభుత్వ వాటా పెరుగుతుంది. అంటే- ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 10 శాతం నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద జమ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఎన్సీపీ ఖాతాలో 14 శాతం మొత్తాన్ని జమ చేస్తుంది. అంటే- ఇక్కడ నాలుగు శాతం పెరిగినట్టవుతుంది.

కొత్త పథకం ఏపీ తరహాలోనే ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుందా? లేదా? అనేది స్పష్టంగా తెలియరావట్లేదు. పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించలేమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఓపీఎస్ వల్ల ఖజానాపై ఆర్థిక భారం భారీగా పడుతుందని పేర్కొంది. కొత్త పెన్షన్ సిస్టమ్ మాత్రం మార్కెట్‌తో అనుసంధానించి ఉంటుందని, ఆ లోటును కేంద్రమే భర్తీ చేస్తుందని ఆర్థిక శాఖ అధికారిని తన కథనంలో ఉల్లంఘించింది ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్.
ఈ అంశంపై చర్చించడానికి ఏర్పాటైన టీవీ సోమనాథన్ కమిటీ- తన తదుపరి సమావేశంలో దీనిపై చర్చిస్తుందని పేర్కొంది. ఆగస్టులో ఈ సమావేశం ఏర్పాటవుతుందని తెలిపింది. కొత్త పెన్షన్ స్కీమ్‌ను సవరించాలంటూ అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిడి కాస్త అధికంగా ఉంటోంది.












Click it and Unblock the Notifications