ట్రిపుల్ తలాక్‌పై బిల్లుకు కేంద్రం సన్నాహలు
ట్రిపుల్ తలాక్‌ను పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌ను పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తలాక్‌ను రద్దు చేసే క్రమంలో భాగంగా బిల్లును రూపొందించేందుకు కేంద్రం సమాయత్తమౌతోంది.
ఈ మేరకు బిల్లు రూపకల్పనకు మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పష్టమైన సమాచారం. ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముస్లిం వ్యవస్థలో భాగమైన ఈ తలాక్ వల్ల మహిళలు అన్యాయానికి గురువుతున్నారని, వారికి చట్ట పరమైన రక్షణ కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నారని ప్రభుత్వవర్గాలు ప్రకటిస్తున్నాయి.

గతంలో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని గత ఆగస్టు 22న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం విదితమే. అదే సమయంలో ట్రిపుల్ తలాక్ అనేది మత విశ్వాసాలకు సంబంధించింది. దీనిపై కేందం స్పష్టమైన చట్టాన్ని చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బిల్లును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications