వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు మోసగాళ్లు : నీరవ్ మోదీ, మాల్యా, చోక్సీలకు కేంద్రం షాక్..! రూ 19వేల కోట్ల ఆస్తులు జప్తు..!!

|
Google Oneindia TeluguNews

ఆర్థిక నేరాల్లో ముగ్గురు ముగ్గురే. బ్యాంకుల నుంచి వేలకోట్లు తీసుకుని పంగానామం పెట్టి ఎంచక్కా విదేశాలకు పారిపోయారు. ఆ ముగ్గురే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు. ఈ ముగ్గురు మోసగాళ్లు విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. వారిని అరెస్ట్ చేసి భారత్‌కు తీసుకువచ్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు మోసగాళ్ల నుంచి ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందో కేంద్రం ప్రభుత్వం పార్లమెంటు వేదికగా క్లారిటీ ఇచ్చింది.

ముగ్గురి ఆస్తులు జ‌ప్తు..

ముగ్గురి ఆస్తులు జ‌ప్తు..


విజయ్ మాల్యా, నీరవ్ మోదీ , మెహుల్ చోక్సీలకి చెందిన దాదాపు రూ.19,111.20 కోట్ల విలువైన ఆస్తులను స్వాదీనం చేసినట్లు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సభ్యులు అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వీరి నుంచి జప్తు చేసిన ఆస్తుల నుంచి రూ. 15,113.91 కోట్ల విలువైన ఆస్తులను వివిధ ప్రభుత్వ బ్యాంకులకు తిరిగి అప్పగించినట్లు వెల్లడించారు. అటు రు.335.06 కోట్ల విలువైన ఆస్తులను భారత ప్రభుత్వానికి స్వాధీనం చేసినట్లు తెలిపారు.

 ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు అప్ప‌గింత‌

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు అప్ప‌గింత‌


మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీలు రూ.22,585.83 కోట్లు మేర వివిధ బ్యాంకులను మోసంచేశారని సభలో కేంద్రమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఈ ముగ్గురు తమ సంస్థల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని మోసగించారని తెలిపారు. వీరు మోసగించిన ఆస్తుల్లో 84.61 శాతం ఆస్తులను 2022 మార్చి 15 నాటికి జప్తు చేసినట్లు పేర్కొన్నారు. ఆయా బ్యాంకులకు జరిగిన నష్టాల్లో 66.91 శాతం విలువైన ఆస్తులు తిరిగి బ్యాంకులకు అప్పగించినట్లు చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాత‌ల కన్షార్షియంకు అప్పగించిన ఆస్తుల అమ్మకం ద్వారా రూ 7,975.27 కోట్లు వచ్చినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. ఈ ఆస్తుల మొత్తాన్ని కన్సార్సియంకు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ అప్పగించినట్లు వెల్లడించారు. ఈ సొమ్మును కన్సార్షియం స్వీకరించిందని తెలిపారు.

చ‌ట్ట‌ప్ర‌కారం ముగ్గురిపై చ‌ర్య‌లు

చ‌ట్ట‌ప్ర‌కారం ముగ్గురిపై చ‌ర్య‌లు


విదేశాల్లో దాక్కున్న‌ ఈ ముగ్గురిని భారత్‌కు తీసుకువచ్చేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పంక‌జ్ తెలిపారు . చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుని శిక్ష ప‌డేలా చూస్తామ‌ని చెప్పారు. మ‌నీలాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం 2022, ఫ్యూజివివ్ ఎక‌నమిక్ అఫెండ‌ర్స్ యాక్ట్ 2018 ప్ర‌కారం మ‌నీలాండ‌రింగ్‌లో చిక్కుకున్న ఆస్తుల‌ను రుణాలిచ్చిన బ్యాంకుల‌తో పాటు చ‌ట్ట‌బ‌ద్ద‌మైన మూడో ప‌క్షానికి అప్ప‌గించే అధికారం కోర్టుకు ఉంది... ఈ చ‌ట్టాలు నీర‌వ్ మోదీ, విజ‌య్ మాల్యా, మెహుల్ చోక్సీల‌కు కేసుల‌కు కూడా వ‌ర్తిస్తాయి. ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం వారి ఆస్తుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటుంది ..

English summary
Central Govt says seized assets worth over Rs 19,000 crore belonging to Mallya, Neerav Modi,Choksi and restored to banks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X