Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికలకు సహకరిస్తేనే రాష్ట్ర హోదా-జమ్ముకశ్మీర్‌ నేతలకు తేల్చిచెప్పిన కేంద్రం

జమ్ముకశ్మీర్‌కు చెందిన అఖిలపక్ష నేతలతో ప్రధాని ఇవాళ నిర్వహించిన భేటీ ముగిసింది. 14 మంది సభ్యుల గుప్కర్ అలయన్స్‌తో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా నిర్వహించిన ఈ భేటీలో అందరూ పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడంతో పాటు రాజకీయ ఖైదీల విడుదల, ఇతర అంశాల్ని నేతలు ప్రస్తావించగా.. ప్రజాస్వామ్య ప్రక్రియకు సహకరిస్తే తాము కూడా రాష్ట్ర హోదా ఇచ్చేందుకు సిద్ధమన్న సంకేతాల్ని కేంద్రం ఇచ్చింది.

 గుప్కర్‌ అలయన్స్‌తో ప్రధాని భేటీ

గుప్కర్‌ అలయన్స్‌తో ప్రధాని భేటీ


జమ్ముకశ్మీర్‌కు చెందిన గుప్కర్‌ అలయన్స్‌ ప్రతినిధులతో ఇవాళ దాదాపు మూడున్నర గంటల పాటు నిర్వహించిన భేటీలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఇందులో జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజనకు సహకరించాలని రాజకీయ పార్టీల్ని ప్రధాని కోరారు. ప్రస్తుత పాలనలో జమ్ముకశ్మీర్‌లో బ్లాక్‌ స్ధాయి ఎన్నికలు సహా పలు మార్పులు చేపట్టామని, దీనికి కొనసాగింపుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మోడీ వారికి వివరించారు.

రాష్ట్ర హోదాకు ఎన్నికలతో లింకు ?

రాష్ట్ర హోదాకు ఎన్నికలతో లింకు ?


మరోవైపు ఎన్నికల కోసం జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో చురుగ్గా పాలుపంచుకోవాలని నేతల్ని కోరిన ప్రధాని మోడీ.. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు వారికి వివరించారు. గతంలో పార్లమెంటులోనే ఈ విషయాన్ని చెప్పినట్లు ప్రధాని వారికి గుర్తుచేశారు. తద్వారా ఎన్నికలకు సహకరిస్తేనే రాష్ట్ర హోదా ఇస్తామని ప్రధాని లింక్‌ పెట్టినట్లు తెలుస్తోంది.
రాజకీయ ఖైదీల విడుదల సహా ఇతర డిమాండ్లను నెరవేరుస్తామని ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది.

కేంద్రానికి కాంగ్రెస్‌ ఐదు డిమాండ్లు

కేంద్రానికి కాంగ్రెస్‌ ఐదు డిమాండ్లు

ప్రజాస్వామ్యాన్ని బలపర్చడమే ఈ సమావేశం ప్రధాన అజెండా అని సమావేశం అనంతరం కాంగ్రెస్ గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.
జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఆగష్టు 2019 తర్వాత అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కూడా కోరామన్నారు. కశ్మీరీ పండిట్‌లకు పునరావాసం కల్పించాలని ఆజాద్‌ కోరారు. రాష్ట్ర హోదా పునురుద్ధరణ డిమాండ్‌ను ప్రధానికి వినిపించినట్లు ఆజాద్‌ తెలిపారు. రాష్ట్ర హోదా పునురుద్దరించేందుకు ఇదే మంచి సమయమన్నారు. కేంద్రం ముందు కాంగ్రెస్ తరుపున నుంచి 5 డిమాండ్లు ముందుంచామని, కాంగ్రెస్ నుంచి సమావేశంలో ముగ్గురం పాల్గొన్నామని ఆజాద్‌ వెల్లడించారు.
కశ్మీర్‌ విషయంలో హద్దులు పరిమితులపై కేంద్రం హామీ ఇవ్వాలని ఆయన కోరారు.

కశ్మీర్‌ ప్రజాగొంతుక వినిపించాం

కశ్మీర్‌ ప్రజాగొంతుక వినిపించాం


ప్రధాన మంత్రి మోడీ దాదాపు మూడున్నర గంటల పాటు తాము చెప్పిన విషయాలని విన్నారని, .ప్రజల గొంతుకను సమావేశంలో వినిపించామని గుప్కర్‌ అలయన్స్‌ నేత అల్తాఫ్ బుఖారీ తెలిపారు. డీలిమిటేషన్‌కు ఇది రోడ్‌మ్యాప్ అని ప్రధాని అన్నారని, అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను ప్రధాని ముందు ఉంచాయని ఆయన తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో త్వరలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని బుఖారీ తెలిపారు. డీలిమిటేషన్ నుంచి ఎన్నికల ప్రక్రియ వరకు అన్ని విషయాలు చర్చించామని, మోడీతో సమావేశం చాలా సాఫీగా సాగిందని ఆయన వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఆర్టికల్ 370ని రద్దు చేయొచ్చని మరో నేత ముజఫర్ బేగ్ తెలిపారు. ఆర్టికల్ 370 సుప్రీంకోర్టులో ఉందని, సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలని బేగ్ పేర్కొన్నారు. మంచి నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు గుప్కర్ అలయన్స్‌లో మరో నేత సజద్ లోన్ వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+