శ్రీనగర్ లో స్ధానికేతరుల హత్యల కలకలం-మళ్లీ ప్రత్యేక నిఘా బృంద పంపిన కేంద్రం

జమ్మూకశ్మీర్ లో మారుతున్న పరిస్ధితుల్లో స్ధానికేతరులు పాగా వేయడాన్ని జీర్ణించుకోలేక ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. స్ధానికేతరుల్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు సాగిస్తున్న దాడుల్లో తాజాాగా ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్రం సీరియస్ అవుతోంది.

కశ్మీర్ లోని శ్రీనగర్ లో తాజాగా చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపోయిన ఘటనపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందిస్తోంది, రెండు రోజుల క్రితం వరకూ అక్కడే ఉన్న ప్రత్యేక నిఘా బృందాన్ని తిరిగి అక్కడికి పంపాలని నిర్ణయం తీసుకుంది. వెంటనే శ్రీనగర్ వెళ్లి అక్కడేం జరుగుతుందో చెప్పాలని నిఘా బృందాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. దీంతో నిఘా బృందం శ్రీనగర్ బయయలుదేరి వెళ్లింది. శ్రీనగర్ హత్యల వెనుక ఎవరున్నారు, స్ధానికేతరుల్ని టార్గెట్ చేస్తున్నది ఎవరనే అంశాలపై ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.

centre sent special intelligence team to srinagar again after non locals killings

శ్రీనగర్ ఘటనపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ... అక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఆదివారం శ్రీనగర్ లోని కుల్గాం జిల్లాలో వాన్పో ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా.. మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజుల్లో స్ధానికేతరులపై జరిగిన మూడో దాడి ఇది. శనివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ వీధి వ్యాపారి, ఇద్దరు స్ధానికేతర కార్మికులు, ఓ కార్పెంటర్ చనిపోయారు. దీంతో కేంద్రం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటోంది అలాగే టెర్రరిస్టులు విచక్షణారహితంగా ఈ కాల్పులు జరుపుతున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్తున్నారు.

రెండేళ్ల క్రితం కేంద్రం ఆర్టికల్360, ఆర్టికల్ 35ఏ రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన సహా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కశ్మీర్ కు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఇక్కడ స్ధిరనివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అలాగే కశ్మీర్ పండిట్లు కూడా తిరిగి రావాలని కేంద్రం పదే పదే కోరుతోంది. దీంతో ఉగ్రవాదులు ఇక్కడికి తిరిగి రావాలనుకునే వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈ హత్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+