B.1.1.529 హడలెత్తిస్తోన్న కొత్త కరోనా వేరియంట్: రాష్ట్రాలు, యూటీలను అలర్ట్ చేసిన వైద్యారోగ్యశాఖ
కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గినా.. వేరియంట్స్ మాత్రం భయపెడుతున్నాయి. డెల్టా, డెల్టా ప్లస్ గజ గజ వణికించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ వచ్చింది. దీంతో యావత్ ప్రపంచం అలర్ట్ అయ్యింది. భారత్ కూడా.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఆ దేశాల నుంచి వచ్చే వారిని కఠినంగా స్క్రీనింగ్ చేయాలని స్పష్టంచేసింది.
దక్షిణాఫ్రికాతోపాటు హాంకాంగ్, బోట్స్వానాలో కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్, టెస్టింగ్ చేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. ఆ వేరియంట్ దేశంలోకి ప్రవేశించకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

కోవిడ్ కొత్త వేరియంట్ B.1.1.529 కేసులు బోట్స్వానాలో మూడు, దక్షిణాఫ్రికాలో ఆరు, హాంక్ కాంగ్ ఒక కేసు వచ్చాయని NCDC రిపోర్ట్ చేసి్ది. ఈ వేరియంట్‌లో గణనీయమైన సంఖ్యలో ఉత్పరివర్తనలు ఉన్నట్లు నివేదించింది. ఇటీవల సడలించిన వీసా పరిమితులు మరియు అంతర్జాతీయ ప్రయాణానికి తెరతీసిన దృష్ట్యా దేశంపై తీవ్రమైన ప్రజారోగ్య ప్రభావాలను కలిగి ఉందని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ దేశాల నుండి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులతో పాటు వారితో పరిచయాలను కలిగిన వారిని కూడా కూడా కేంద్రహోంశాఖ మార్గదర్శకాల ప్రకారం నిశితంగా ట్రాక్ చేయాలి మరియు పరీక్షించబడాలి అని లేఖలో తెలిపారు.
Recommended Video
కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎక్కడో.. ఎవరో కొందరు తీసుకోలేదు. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. అంతా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని విశ్వసించవచ్చు.












Click it and Unblock the Notifications