పాకిస్తాన్ తో యుద్ధంపై భారత్ కీలక నిర్ణయం ? కాసేపట్లో ప్రకటన..!
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా ఇవాళ మరో కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించింది. దీన్ని భారత సేనలు దీటుగా తిప్పికొడుతున్నాయి. అయినా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. ముఖ్యంగా రాత్రి కాగానే భారత నగరాలపై పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లు దూసుకువస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు సైన్యం కూల్చేస్తోంది. అయినా దాడులు ఆగట్లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ పై ఇకపై పాకిస్తాన్ చేసే అలాంటి దాడిని అయినా యుద్ధ చర్యగానే భావించాలని కేంద్రం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్తాన్ నుంచి మన దేశంపై జరిగే దాడిని యుద్దంగా భావించి అందుకు తగ్గట్టుగా ప్రతిస్పందించాలని నిర్ణయించింది. దీనిపై ఇవాళ సాయంత్రం జరిగే విదేశాంగ, రక్షణశాఖల ఉమ్మడి ప్రెస్ మీట్ లో అధికారిక ప్రకటన చేయబోతున్నారు. తద్వారా ఇకపై పాక్ దాడి చేస్తే ఇక నేరుగా అసలు యుద్ధం మెదలుపెట్టేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది..

గత మూడు రాత్రులుగా పాకిస్తాన్ ఉత్తర భారతదేశంలోని సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపై డ్రోన్, క్షిపణి దాడులను కొనసాగిస్తోంది. వాటిలో దాదాపు అన్నింటినీ బలమైన భారత వైమానిక రక్షణ నెట్‌వర్క్ అడ్డుకుంది. అయితే వీటిని ఇలాగే వదిలేస్తే దీర్ఘకాలం ఇలాంటి కవ్వింపు చర్యలు కొనసాగే ప్రమాదం ఉందని బావిస్తున్న కేంద్రం.. ఇకపై దాడికి దిగితే యుద్ధంగానే పరిణిస్తామని హెచ్చరికలు పంపబోతోంది.
పాకిస్తాన్ ప్రతీ రాత్రి చేస్తున్న డ్రోన్, మిసైల్ దాడులపై ఇవాళ త్రివిధ దళాధిపతులతో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోడీ.. ఈ మేరకు వీటికి అడ్డుకట్ట వేసేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా దాడులు కొనసాగితే మాత్రం పాకిస్తాన్ పై పూర్తి స్థాయి యుద్ధానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇవాళ సాయంత్రం రక్షణశాఖ ఓ ప్రకటన చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications