116 జిల్లాల్లోని కూలీలకు 125 రోజుల పని, ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’‌కు రూ.50 వేల కోట్లు

కరోనా మహమ్మరి వల్ల లక్షలాది మంది వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్లారు. దీంతో అక్కడ వారికి ఉపాధి కరవైంది. కూలీలు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 'గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్' అనే పథకం ప్రవేశపెట్టబోతుంది. ఈ నెల 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పథకం కోసం 50 వేల కోట్ల నిధులు కేటాయించామని ఆమె ప్రకటించారు.

బీహర్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌కు చెందిన 116 జిల్లాలకు వలసకూలీలు తిరిగి వచ్చేశారు. వీరిని 25 పథకాల్లో ఏడాదిలో కనీసం 125 రోజులు పని కల్పిస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వలసకూలీలను కేంద్రంతోపాటు, సదరు రాష్ట్రం గుర్తిస్తోందని ఆమె తెలిపారు.

Centre to pump Rs 50,000 cr into Garib Kalyan Rojgar Abhiyaan to boost jobs..

సొంత రాష్ట్రంలో కూలీలకు ఉపాధి లభిస్తోందని.. దీంతో ఆకలి కేకలు తీరతాయని చెప్పారు. 116 జిల్లాలకు వలసకూలీలు తిరిగి వచ్చారని.. ఒక్కో జిల్లాలో కనీసం 25 వేల మంది ఉంటారని చెప్పారు. వారందరికీ పని కల్పించి, కూలీ అందిస్తామన్నారు. ఆ కుటుంబాల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని నొక్కి వక్కానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+