President of Bharat : ఇండియా పేరు మార్చేసిన కేంద్రం ! జీ20 సదస్సు ఆహ్వానంలో ప్రస్తావన !

మన దేశానికి ఉన్న ఇండియా పేరును కాస్తా భారత్ గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇవాళ ప్రచారం గుప్పుమంది. ఈ నెల 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక భేటీలో ఇండియా పేరును కాస్తా భారత్ గా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ముందే ఇండియాకు బదులు అధికారికంగా భారత్ పేరును కేంద్రం ఓ చోట వాడటం చర్చనీయాంశమవుతోంది.

centre used President of Bharat name in G20 invitations before official name change from india

ఈ నెల 8వ తేదీ నుంచి జీ20 దేశాల సదస్సు జరగబోతోంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ సదస్సుకు దేశ, విదేశీ అతిధుల్ని ఆహ్వానించారు. వీరికి పంపిన ఆహ్వన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వానాలు పంపారు. వాస్తవానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వెళ్లాల్సిన ఈ ఆహ్వానాలు కాస్తా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో వెళ్లడంతో అతిధులు కూడా కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. తిరిగి దీన్ని నిర్ధారించుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరును భారత్ గా మార్చబోతున్నట్లు నిన్నటి నుంచి ప్రచారం మొదలైంది. అయితే కేంద్రం ఇంత త్వరగా జీ20 సదస్సు ఆహ్వాన పత్రికల్లో ఇలా ఇండియాకు బదులుగా భారత్ పేరుతో అదీ రాష్ట్రపతి పేరుకు తగిలించి మరీ ప్రస్తావించడంతో ఈ వాదన నిజమేనని తేలిపోతోంది. దీనిపై విపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జరుగుతున్న ప్రచారం నిజమేనన్నమాట అంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి భవన్ సెప్టెంబరు 9వ తేదీన జరిగే G20 విందు కోసం సాధారణ 'భారత రాష్ట్రపతి'కి బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పేరుతో ఆహ్వానాన్ని పంపిందని, ఇప్పుడు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఇలా చదవవచ్చు: "భారత్, అది భారతదేశం, రాష్ట్రాల యూనియన్ అవుతుంది." కానీ ఇప్పుడు ఈ "యూనియన్ ఆఫ్ స్టేట్స్" కూడా దాడికి గురవుతోంది. అంటూ జైరాం రమేష్ కేంద్రానికి చురకలు అంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+