వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పులపై తప్పుడు వివరాలిస్తే కఠిన చర్యలే-ఐఏఎస్,ఐపీఎస్ లకు కేంద్రం హెచ్చరిక-ఏపీ దృష్టితోనే ?

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇందుకోసం ఏపీ వంటి రాష్ట్రాలు అప్పులని ఆశ్రయిస్తున్నాయి. అదీ లెక్కకు మించి అప్పులు చేస్తున్నాయి. అసెంబ్లీకి చెప్పకుండా, బడ్డెట్ లో ప్రవేశపెట్టకుండా ఏపీలో వైసీపీ సర్కార్ అప్పులు చేస్తూ పోతోంది. ఈ సమాచారాన్ని కేంద్రానికి ఏ మేరకు ఇస్తుందో కూడా తెలియని పరిస్ధితి. ఇలాంటి ఉదంతాలపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఇకపై రాష్ట్రాల అప్పులపై కేంద్రానికి తప్పుడు సమాచారమిచ్చినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

 అప్పులపై తప్పుడు సమాచారం

అప్పులపై తప్పుడు సమాచారం

గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అప్పుల భారం పెరుగుతోంది. అదే సమయంలో కేంద్రం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిమితి పాటించక తప్పని పరిస్దితి. దీన్ని ఉల్లంఘిస్తే కేంద్రం మరిన్ని అప్పులకు అవకాశం ఇవ్వకపోగా.. గతంలో ఇచ్చిన పరిమితుల్లో కోత విధిస్తోంది. దీన్నుంచి బయటపడేందుకు కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి తాము తీసుకున్న అప్పులపై తప్పుడు సమాచారాన్ని సమర్పిస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా దీన్ని నమ్మి విచ్చలవిడిగా అనుమతులు ఇస్తోంది. ఈ వ్యవహారం అంతిమంగా దేశ ఆర్ధిక పరిస్ధితిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీన్ని గమనించిన ఆర్ధికశాఖ కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది.

 ఐఏఎస్, ఐపీఎస్ లకు హెచ్చరికలు

ఐఏఎస్, ఐపీఎస్ లకు హెచ్చరికలు

రాష్ట్రాలు కేంద్రాలకు తమ అఫ్పుల వివరాలు ఇవ్వాలంటే అది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ద్వారానే జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రాల ఆర్ధిక సంస్ధలకు, ప్రభుత్వాలకు, అవి తీసుకునే నిర్ణయాలకు కేంద్రం బిందువులు వారే. కాబట్టి రాష్ట్రాలు తాము తీసుకున్న అప్పులపై సరైన వివరాలు కేంద్రానికి ఇవ్వాల్సిన బాధ్యత వారిదే. ఇందులో నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వాల మెప్పు కోసం తప్పుడు వివరాలు పంపితే వాటి ఆధారంగా కేంద్రం కూడా పరిమితుల్లో మార్పులు చేస్తోంది. ఇది అంతిమంగా దేశ ఆర్ధిక పరిస్ధితిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్న కేంద్రం ఇవాళ తీవ్రంగా స్పందించింది. అంతే కాదు అలాంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు హెచ్చరికలు పంపింది.

 తప్పుడు సమాచారమిస్తే చర్యలివే..

తప్పుడు సమాచారమిస్తే చర్యలివే..

ఇకపై రాష్ట్రాలు తీసుకుంటున్న అప్పుల విషయంలో కేంద్రానికి తప్పుడు సమాచారమిచ్చి, తప్పుదోవ పట్టించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ డీవోపీటీకి సిఫార్సు చేస్తామని ఆర్ధికశాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఇదే కోవలో రాష్ట్రాల అప్పులపై తమకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది.ఇందుకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఒక రాష్ట్రం తప్పుడు ఆర్థిక సమాచారాన్ని అందించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించినట్లయితే, సంబంధిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివరాలు, పేర్లను సిబ్బంది, శిక్షణ విభాగానికి (DoPT) తెలియజేస్తామని, అది తగు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. అధికారుల ఎంపానెల్‌మెంట్, సెంట్రల్ డిప్యూటేషన్, ఇంటర్-కేడర్ డిప్యూటేషన్, విదేశీ శిక్షణ, విదేశీ అసైన్‌మెంట్‌లకు సంబంధించిన విషయాలపై వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని హెచ్చరించింది.

English summary
the union finance ministry on today warns ias and ips officers of stringent action against their wrong information of states borrowings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X