Bharat Taxi App: జనవరి 1న కేంద్రం కొత్త ట్యాక్సీ యాప్-చౌక ప్రయాణం- డ్రైవర్లకు పండగే..!
దేశవ్యాప్తంగా ప్రైవేట్ ట్యాక్సీ సర్వీసులతో ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త మెబైల్ యాప్ ను తీసుకువస్తోంది. భారత్ ట్యాక్సీ యాప్ పేరుతో తీసుకొస్తున్న ఈ అప్లికేషన్ ద్వారా ఆటోలు, కార్లు, బైక్ లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేసేందుకు వీలుంటుంది. అలాగే ప్రైవేట్ యాప్, ట్యాక్సీ సేవలతో పోలిస్తే మెరుగైన సేవలు చౌక ధరల్లో అందించే అవకాశముంది. అలాగే డ్రైవర్లకు భారీ ప్రయోజనం ఉండబోతోంది.
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ట్యాక్సీ ప్రయాణాల ధరలను అరికట్టడానికి కేంద్రం ఈ భారత్ ట్యాక్సీ యాప్ ను తీసుకొస్తోంది. న్యూఢిల్లీలో జనవరి 1న కొత్త సంవత్సర కానుకగా దీన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతోంది. ఇందులో పని చేయాలని ఆసక్తిగా ఉన్న డ్రైవర్లను పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం కోరింది. దీంతో ఇప్పటికే 56 వేల మంది ఈ యాప్ లో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ భారత్ ట్యాక్సీ యాప్ లో పేర్లు నమోదు చేసుకున్న డ్రైవర్లకు ప్రయాణికుల నుంచి లభించే ఛార్జీల్లో 80 శాతం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో భారత్ ట్యాక్సీ యాప్ లో నమోదైన డ్రైవర్లకు భారీ ప్రయోజనం లభించబోతోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రైవేట్ యాప్ లు ఓలా, ఉబెర్ లకు ఈ యాప్ షాక్ ఇవ్వబోతోంది. వీటిలో డ్రైవర్లకు ప్రయాణికుల నుంచి వచ్చే ఛార్జీల్లో అత్యల్పభాగం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రయాణికుల భద్రతపైనా ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు చౌక ప్రయాణంతో పాటు డ్రైవర్లకూ ప్రయోజకారిగా ఉండేలా కేంద్రం దీన్ని తెస్తోంది. దీంతో పాటు మార్కెట్ లో ప్రైవేట్ ప్లేయర్ల గుత్తాధిపత్యానికి చెక్ పడనుంది.
-
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications