బడ్జెట్లో బంగ్లాదేశ్, ఇరాన్ లకు కేంద్రం బిగ్ షాక్..! ఇద్దరికీ ఇలా..!
ఈసారి కేంద్ర బడ్డెట్ (budget 2026) లో భారత్ లోని రాష్ట్రాలకే కాదు కేంద్రంతో సఖ్యతగా లేని విదేశాలకూ షాక్ లు తగిలాయి.
ఇందులో మైనార్టీలతో దాడుల్ని చూసీచూడనట్లుగా వదిలేస్తున్న బంగ్లాదేశ్ తో పాటు అమెరికా ఆగ్రహంతో టార్గెట్ అవుతున్న ఇరాన్ కూడా ఉన్నాయి. ఈ రెండు దేశాలకు రెండు వేర్వేరు రూపాల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి తన బడ్జెట్ లో షాకులు ఇచ్చారు. దీంతో ఈ రెండు దేశాల విషయంలో కేంద్రం వైఖరి కూడా తేటతెల్లమైంది.
ప్రతిసారీ కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రాలతో పాటు మన దేశంతో సన్నిహితంగా ఉంటున్న దేశాలకూ వ్యూహాత్మకంగా నిధులు కేటాయిస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. భారత విదేశాంగ విధానంలో భాగంగా ఈ కేటాయింపులు చేస్తుంటారు. అయితే ఈసారి మారిన పరిస్ధితుల్లో పొరుగుదేశం బంగ్లాదేశ్ కు భారత్ షాకిచ్చింది. 2026-27 కేంద్ర బడ్జెట్‌లో బంగ్లాదేశ్‌కు ఇచ్చే నిధుల్లో సగం కోత పెట్టింది. గత ఆర్దిక సంవత్సరంలో 120 కోట్లు కేటాయిస్తే ఈసారి దాన్ని 60 కోట్లకు తగ్గించింది. ఆ దేశంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు భారత్ తో సుదీర్ఘ కాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న మిత్రదేశం ఇరాన్ కు కూడా ఈసారి బడ్జెట్ లో కేంద్రం షాకిచ్చింది. గతానికి భిన్నంగా, భారత్ తన కేంద్ర బడ్జెట్‌లో చబహార్ పోర్టు ప్రాజెక్టుకు ఎటువంటి నిధులను కేటాయించలేదు. అమెరికా ఇరాన్‌పై విధించిన తాజా ఆర్థిక ఆంక్షలకు వ్యూహాత్మక ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి చబహార్ పోర్టు అభివృద్ధిలో భారతదేశం ప్రధాన భాగస్వామిగా ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికా ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించింది. అయితే చబహార్ పోర్ట్ ప్రాజెక్ట్‌పై చర్యల నుండి భారత్ కు మాత్రం 6 నెలల మినహాయింపు ఇచ్చింది.
ఇది ఏప్రిల్ 26న ముగుస్తుంది. దీంతో ఈసారి బడ్జెట్ లో ఈ పోర్టుకు నిధులు ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications