Article 370: జమ్మూ కాశ్మీర్ విభజనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు వ్యవహారం.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ విషయంలో జోక్యం చేసుకోనుంది. సమగ్రంగా విచారణ చేపట్టడానికి రంగం సిద్ధం చేసింది. దీనికి ముహూర్తాన్ని కూడా నిర్ధారించింది. దసరా సెలవులు ముగిసిన వెంటనే విచారణకు స్వీకరించనుంది. ఆర్టికల్ 370 రద్దయిన మూడు సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువడిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి 2019లో కేంద్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పిన అతి కొద్దిరోజుల్లోనే ఆర్టికల్ 370 రద్దయింది. దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం అదే ఏడాది అక్టోబర్‌లో పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపజేసుకుంది.

Certainly list it, says CJI on list the Matter challenging abrogation of Article 370 after Dussehra

ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్‌ను రెండుగా విభజించింది. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్, లఢక్ పేరుతో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి. ఈ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. అర్జంట్ హియరింగ్ కింద లిస్టింగ్ చేయాలంటూ పిటీషన్‌దారు చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. దసరా సెలవుల తరువాత విచారణ ఉంటుందని హామీ ఇచ్చింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సభ్యుల్లో ఒకరైన జస్టిస్ సుభాష్ రెడ్డి ఈ ఏడాది పదవీ విరమణ చేశారు. వారు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం వల్ల ఈ బెంచ్‌ను పునర్నిర్మించాల్సి ఉంటుందని ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ అన్నారు. దసరా సెలవులు ముగిసిన వెంటనే దీన్ని విచారణకు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. దీనితో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందనే విషయంపై ఆసక్తి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+