Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య..! అధికారిక ప్రకటనే తరువాయి..!
కర్ణాటకలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపిక కత్తిమీద సాములా మారింది. సిద్ధరామయ్య(Siddaramaiah), డీకే శివకుమార్ సీఎం పదవికి కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి సీఎం పదవి ఇవ్వాలనేదానికి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సిద్ధరామయ్య పేరును రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
నిన్న జరిగిన సీఎల్పీ భేటీలో 135 మందిలో 90 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకే ఓటు వేశారని సమాచారం. ఈ విషయాన్ని పార్టీ పరిశీలకులు అధిష్ఠానికి తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ ముఖ్యనాయకులతో సమావేశం అవుతున్నారు. ఢిల్లీకి తాను వెళ్లబోవట్లేదని తేల్చి చెప్పిన శివకుమార్.. పనిలో పనిగా చివరిలో సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా సిద్ధరామయ్యకు సీఎం పదవి ఖాయమైనట్లు ఇండికేషన్ గా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశానని, అది ఇప్పుడు సత్ఫలితాలను ఇచ్చిందని, తనకు సీనియారిటీ, అనుభవం, పాపులారిటీ కూడా ఉన్నాయని, మరో పర్యాయం ముఖ్యమంత్రిగా ఉండేందుకు సిద్ధరామయ్య పట్టుబట్టినట్లు సమాచారం. 2018లో సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ఓడిపోవడంతో పాటు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేపీసీసీ అధ్యక్షుడిగా తాను పార్టీని తాపీగా తిరిగి నిర్మించానని, ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు తనకు ఉన్నాయని శివకుమార్ వాదించారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే తనకు కురుబలు మాత్రమే కాదు, ఓబీసీలు, దళితులు, మైనారిటీల మద్దతు కూడా కీలకమని సిద్ధరామయ్య తన వాదనను వినిపించారు. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనే రాష్ట్ర జనాభాలో 11% ఉన్న వొక్కలిగాల కోరిక అని చెప్పారు. నాయకత్వ సమస్యపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా, కేంద్ర నాయకులు ఒక్కొక్క ఎమ్మెల్యేల అభిప్రాయాలను మౌఖికంగా సేకరించడం ప్రారంభించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications