తాజ్ మహల్ లో కుప్పకూలిన షాండ్లియర్
ఆగ్రా: ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన అందాల కట్టడం తాజ్ మహల్ లో ఉన్న షాండ్లియర్ ఒకటి కిందకు పడిపోయింది. బ్రిటిష్ కాలం నాటి 60 కిలోల బరువు ఉన్న షాండ్లియర్ పడి పోయిందని అక్కడి అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై అర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. 1905లో బ్రిటిష్ అధికారి లార్డ్ కర్జన్ ఆరు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ షాండ్లియర్ ను బహుమతిగా ఇచ్చారు.

తాజ్ మహల్ లో ఉన్న ఈ షాండ్లియర్ పడిపోవడంతో ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు భువన్ విక్రమ్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే షాండ్లియర్ ఎందుకు పడిపోయింది అని అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని ఏఎస్ఐ అధికారులు చెబుతున్నారు.
అయితే షాండ్లియర్ చాల పాతది అయిపోవడం వలనే పడిపోయి ఉంటుందని అధికారులు అంటున్నారు. షాండ్లియర్ పడిపోయిన సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని టూరిస్ట్ గైడ్ లు అంటున్నారు.












Click it and Unblock the Notifications